DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా.. 3% డీఏ పెంపుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం!

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక. డీఏ 3 శాతం పెంపునకు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ ఆమోదం.

Arun Chilukuri
Published on: 28 Oct 2026 5:00 PM IST
DA Hike
X

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా.. 3% డీఏ పెంపుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం!

DA Hike: దీపావళి పండగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ తీపి కబురు అందించింది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA), పింఛనుదారుల కరవు భృతిని (DR) మరొక 3 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

60% నుంచి 63%కి పెరుగుదల ఈ పెంపుతో కేంద్ర ఉద్యోగుల డీఏ ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది. ఈ డీఏ పెంపు 2026 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఉద్యోగులకు, పింఛనుదారులకు పెండింగ్ అరియర్స్ కూడా లభించనున్నాయి.

ఈ నిర్ణయంతో దాదాపు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పింఛనుదారులు (మొత్తం 1.17 కోట్ల మంది) ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ. 10,016 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.

క్యాబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు:

కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకం: దేశీయంగా ఓడరేవులు, సరుకు రవాణా కోసం కంటైనర్ల తయారీని ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్లతో కొత్త పథకానికి ఆమోదం.

ప్రధాన మంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ పథకం: గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రూ. 7,395 కోట్లు మంజూరు.

ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్: క్రీడా పరికరాల స్వదేశీ తయారీకి ప్రాధాన్యమిస్తూ రూ. 1,856 కోట్లు కేటాయింపు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.