Jio: ఒక్క కస్టమర్ నుంచి జియో ఎంత సంపాదిస్తుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు..
Jio: రిలయన్స్ జియో తన తాజా ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జియో ప్రతి కస్టమర్ నుండి సగటున రూ. 215 ఆదాయాన్ని పొందుతోంది.
Jio: ఒక్క కస్టమర్ నుంచి జియో ఎంత సంపాదిస్తుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు..
Jio: రిలయన్స్ జియో తన తాజా ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జియో ప్రతి కస్టమర్ నుండి సగటున రూ. 215 ఆదాయాన్ని పొందుతోంది. సంస్థ వృద్ధి రేటు, కస్టమర్ల సంఖ్యకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రిలయన్స్ లిమిటెడ్ తన ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం, జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఒక్కో కస్టమర్ నుంచి నెలకు రూ. 215 చొప్పున ఆదాయం వస్తోంది. దీనినే టెలికాం భాషలో 'Average Revenue per User'(ARPU) అని పిలుస్తారు.
ప్రస్తుతం జియో కస్టమర్ల మొత్తం సంఖ్య 53.3 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 9.2 శాతం పెరిగి, పన్నులు చెల్లించిన తర్వాత రూ. 7,764 కోట్లకు చేరుకుంది. టెలికాం రంగంలో జియో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. కాగా, ఈ గణాంకాలు జియో వినియోగదారుల పెరుగుదలతో పాటు, సగటు ఆదాయం పెరగడాన్ని కూడా సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను విస్తరించడంలో జియో వేగంగా దూసుకుపోతోంది.




