మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ చిన్న తప్పు చేస్తే లక్షల్లో నష్టపోతారు.. ఇది చాలామందికి తెలియదు..

Mutual fund: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే రాబడి లేని ఫండ్స్‌లో అలాగే ఉండిపోతే కాంపౌండింగ్ లాభం పోతుందా.?

Ravi
By Ravi
Published on: 2 Jun 2026 10:56 AM IST
Mutual fund
X

మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ చిన్న తప్పు చేస్తే లక్షల్లో నష్టపోతారు.. ఇది చాలామందికి తెలియదు..

Mutual fund: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఎస్‌ఐపీ ద్వారా పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇక్కడ చాలామంది తెలియక చేసే ఒక చిన్న తప్పు వల్ల లక్షల్లో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. మనం ఎంచుకున్న ఫండ్ సరిగ్గా రాబడి ఇవ్వకపోయినా, ఒకవేళ వేరే మంచి ఫండ్‌కు మారితే మనకు వచ్చే 'కాంపౌండింగ్ ఇంట్రెస్ట్' లాభం ఎక్కడ పోతుందోనన్న అనవసరపు భయంతో చాలామంది అలాగే ఉండిపోతారు. అలాగే ట్యాక్స్ ఎక్కువగా పడుతుందన్న కంగారుతో మరికొందరు పాత ఫండ్‌లోనే కొనసాగుతారు. మీకూ ఇలాంటి సందేహం ఉందా? అయితే ఈ ఆర్థిక విషయాలు మీకోసమే!

ఒక ఫండ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు అందులోంచి వేరొక మెరుగైన ఫండ్‌కు మారడం వల్ల కాంపౌండింగ్ పవర్ ఏమాత్రం పోదని ఆర్థిక నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. నిజానికి, రాబడి అసలు లేని ఫండ్‌లో అలాగే గుడ్డిగా కొనసాగితేనే మీరు భవిష్యత్తులో భారీగా నష్టపోతారు. పాత ఫండ్ నుంచి మీ డబ్బులు తీసి కొత్త ఫండ్‌లో పెట్టినప్పుడు, ఆ మొత్తం మీ కొత్త ప్రిన్సిపల్ లేదా అసలు అవుతుంది, అప్పుడు దానిపై కాంపౌండింగ్ యధావిధిగా లాభాలను ఇస్తుంది.

ఇక ట్యాక్స్ విషయానికి వస్తే, మనకు లాభం వస్తేనే కదా మనం ట్యాక్స్ కట్టేది! పైగా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద మన దేశంలో ప్రతి సంవత్సరం 1,25,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో ఫండ్స్ మారుతూ ఉండటం వల్ల ఈ మినహాయింపును మనం సమర్థవంతంగా వాడుకోవచ్చు. అదే మీరు ఏడేళ్ల తర్వాత ఒకేసారి మీ డబ్బులు మొత్తం తీస్తే, అప్పుడు కేవలం ఒక్కసారి మాత్రమే ఆ రూ. 1.25 లక్షల మినహాయింపు లభిస్తుంది.

అలాగే, కొత్తగా ఎన్నో ఏఎంసీలు, ఫండ్స్ వస్తున్నాయని చెప్పి, ఆకర్షణీయంగా కనపడిన ప్రతి ఫండ్‌లో పెట్టుబడి అస్సలు పెట్టకూడదు. మీ పోర్ట్‌ఫోలియోలో ఐదు లేదా ఆరు ఫండ్స్‌కి మించి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఏదో ఒక ఫండ్‌లో పెట్టుబడి పెట్టేసి అలా వదిలేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు, మన పోర్ట్‌ఫోలియో ఎలా పనిచేస్తుందో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం చాలా అవసరం.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story