EPFO: పీఎఫ్ డబ్బుతో LIC ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసా.?

EPFO: ఆర్థిక ఇబ్బందుల కారణంగా LIC పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారిందా? అలాంటి సమయంలో మీ EPF ఖాతాలో ఉన్న డబ్బును ఉపయోగించి LIC ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.

Mokshith
Published on: 23 Sept 2026 4:51 PM IST
EPFO
X

EPFO: పీఎఫ్ డబ్బుతో LIC ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసా.?

EPFO: ఆర్థిక ఇబ్బందుల కారణంగా LIC పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారిందా? అలాంటి సమయంలో మీ EPF ఖాతాలో ఉన్న డబ్బును ఉపయోగించి LIC ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ఈ సదుపాయం ఎలా పొందాలి? ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? తెలుసుకుందాం.

PF డబ్బుతో LIC ప్రీమియం చెల్లించవచ్చా?

అవును. కొన్ని నిబంధనలకు లోబడి EPF ఖాతాలోని డబ్బును LIC పాలసీ ప్రీమియం చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఉద్యోగి EPFO ఫామ్-14ను నింపి సమర్పించాలి. ఫామ్ ఆమోదం పొందిన తర్వాత, నిర్ణయించిన తేదీన LIC ప్రీమియం మొత్తాన్ని EPF ఖాతా నుంచి నేరుగా చెల్లించే విధానం ఉంటుంది. దీంతో ప్రతిసారి ప్రీమియం కోసం ప్రత్యేకంగా డబ్బు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండదు.

ఫారం-14 అంటే ఏమిటి?

ఫారం-14 అనేది EPF ఖాతాలోని నిధులను ఉపయోగించి LIC పాలసీ ప్రీమియం చెల్లించేందుకు ఉపయోగించే అధికారిక దరఖాస్తు ఫారం. ఈ ఫారంలో పాలసీకి సంబంధించిన వివరాలను నమోదు చేసి EPFOకు సమర్పించాలి. దరఖాస్తు ఆమోదమైన తర్వాత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం LIC ప్రీమియం మొత్తాన్ని EPF నుంచి చెల్లించే విధానం అమలవుతుంది.

ఈ సదుపాయం పొందడానికి ఏ నిబంధనలు ఉన్నాయి?

PF ద్వారా LIC ప్రీమియం చెల్లించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి:

* సభ్యుడు కనీసం రెండు సంవత్సరాలుగా EPFలో సభ్యుడిగా ఉండాలి.

* EPF ఖాతాలో సభ్యుడి సొంత వాటాలో కనీసం రెండు సంవత్సరాల LIC ప్రీమియానికి సరిపడే మొత్తం ఉండాలి.

* సభ్యుడి వార్షిక EPF చందా, వార్షిక LIC ప్రీమియం చెల్లించడానికి సరిపడే స్థాయిలో ఉండాలి.

* గతంలో PF ఖాతా నుంచి ఇదే విధంగా బీమా పాలసీ ప్రీమియం చెల్లించేందుకు డబ్బు తీసుకోలేదని ధృవీకరించాలి.

* సంబంధిత LIC పాలసీపై ఎలాంటి రుణ భారం ఉండకూడదు.

* సాధారణంగా EPFలో నమోదు చేసిన నామినీనే LIC పాలసీలోనూ నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది.

ఫారం-14లో ఏ వివరాలు ఇవ్వాలి?

ఫారం-14 సమర్పించే సమయంలో పాలసీకి సంబంధించిన పలు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా LIC పాలసీ ఉన్న శాఖ/యూనిట్ చిరునామా, పాలసీ లేదా ప్రపోజల్ నంబర్, తేదీతో పాటు పాలసీ సమ్ అష్యూర్డ్ వివరాలు, పాలసీ తీసుకున్న తేదీ, వార్షిక ప్రీమియం మొత్తం, మొదటి, తదుపరి ప్రీమియం చెల్లింపు తేదీలు, చివరి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, వయస్సు నిర్ధారణకు సంబంధించిన వివరాలు, నామినీ పేరు (నామినీ మైనర్ అయితే సంరక్షకుడి వివరాలు) గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)కు అప్పగించిన పాలసీ ఏదైనా ఉంటే దాని వివరాలు అందించాల్సి ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.