EPFO: ఏడాదిలో PF డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చు? నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగ జీవితంలో పొదుపుగా నిలిచే ముఖ్యమైన నిధి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది.
EPFO: ఏడాదిలో PF డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చు? నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగ జీవితంలో పొదుపుగా నిలిచే ముఖ్యమైన నిధి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందే PF డబ్బును విత్‌డ్రా చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2026లో PF ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
అత్యవసర పరిస్థితుల్లోనే PF ఉపసంహరణకు అవకాశం:
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై సాధారణ అవసరాల కోసం తరచూ PF డబ్బు తీసుకునే అవకాశం ఉండదు. నిజంగా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడే PF నుంచి డబ్బు తీసుకోవాలని EPFO సూచిస్తోంది. దీని ఉద్దేశం ఉద్యోగుల రిటైర్మెంట్ నిధిని రక్షించడం. అయితే వైద్య అత్యవసర పరిస్థితులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు ఆమోదం ఉద్యోగి PF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా ఉంటుంది.
ఏడాదిలో, నెలలో ఎన్నిసార్లు PF తీసుకోవచ్చు?
EPFO కొత్త నిబంధనల ప్రకారం సాధారణ కేటగిరీల్లో ఉద్యోగులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే PF ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వైద్య అత్యవసర పరిస్థితుల్లో నెలలో 2 నుంచి 4 సార్లు వరకు క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి దరఖాస్తు ఆమోదం PF ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తాన్ని బట్టి నిర్ణయిస్తారు.
అదనంగా ఉద్యోగి తన మొత్తం ఉద్యోగ జీవితంలో..
ఉన్నత విద్య కోసం గరిష్టంగా 10 సార్లు, వివాహ అవసరాల కోసం గరిష్టంగా 5 సార్లు PF నుంచి డబ్బు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగం మారితే PF తీసుకోవద్దు.. ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మంచిది:
చాలామంది ఉద్యోగం మారిన వెంటనే PF డబ్బును విత్‌డ్రా చేస్తుంటారు. అయితే ఇది మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగం మారినప్పుడు PF మొత్తాన్ని కొత్త సంస్థలోని PF ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే సేవా కాలం (Service Tenure) నిరంతరంగా కొనసాగుతుంది. దీంతో భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు (Tax Benefits) కూడా కొనసాగుతాయి. అదే PF మొత్తాన్ని ఉపసంహరించుకుంటే సేవా కాలం మధ్యలో బ్రేక్ అవుతుంది. దీని ప్రభావం భవిష్యత్తు పెన్షన్ లెక్కలపై పడే అవకాశం ఉంది.
5 ఏళ్లలోపు PF తీసుకుంటే TDS వర్తించే అవకాశం:
ఉద్యోగి 5 సంవత్సరాల సేవ పూర్తి కాకముందే తన PF ఖాతా నుంచి రూ.50 వేలకుపైగా ఉపసంహరిస్తే TDS (Tax Deducted at Source) వర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగి పొందాల్సిన మొత్తంలో కొంత భాగం పన్నుగా మినహాయిస్తారు. అందుకే అవసరం లేకుండా తరచూ PF డబ్బు తీసుకోవడం భవిష్యత్తు పొదుపును తగ్గించడమే కాకుండా పన్ను భారాన్ని కూడా పెంచుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.




