EPFO: ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. మనీ విత్ డ్రాలో కొత్త రూల్స్ ఇవిగో.!

EPFO: ఈపీఎఫ్‌వో అడ్వాన్స్ మనీ విత్‌డ్రా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అనారోగ్యం, చదువు, పెళ్లి, ఇల్లు కొనుగోలు వంటి వివిధ అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు ఎన్నిసార్లు డ్రా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 7 July 2026 9:51 AM IST
EPFO
X

EPFO: ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. మనీ విత్ డ్రాలో కొత్త రూల్స్ ఇవిగో.!

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈపీఎఫ్‌వోలో ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తున్న కేంద్రం, తాజాగా పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ మనీ విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో కొత్త రూల్స్ తీసుకువచ్చింది. వివిధ అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే వారికి ఈ నిబంధనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

పీఎఫ్ ఖాతాదారులు తమ అవసరాల కోసం అడ్వాన్స్ అమౌంట్ తీసుకునే పరిమితులను ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, అనారోగ్య కారణాలతో అయితే ఖాతాదారులు అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే పిల్లల ఉన్నత చదువుల కోసం గరిష్టంగా 10 సార్లు, వివాహ అవసరాల కోసం 5 సార్లు పీఎఫ్ నగదును తీసుకునే సదుపాయం కల్పించింది. అంతేకాకుండా, ఇల్లు కొనడం, నిర్మాణం చేయడం, హోమ్ లోన్ రీపేమెంట్, లేదా ఇంటి మరమ్మతుల కోసం 5 సార్లు, మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 సార్లు అడ్వాన్స్ పొందే అవకాశాన్ని ఇచ్చింది.

అయితే, ఖాతాదారులు ఈ అడ్వాన్స్ నగదు తీసుకోవాలంటే ఒక ప్రధాన షరతు విధించింది. సదరు ఉద్యోగి ఈపీఎఫ్ మెంబర్‌షిప్ తీసుకుని కనీసం 12 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ అడ్వాన్స్ విత్‌డ్రాలకు అర్హులు అవుతారని స్పష్టం చేసింది. ఈ అర్హతలు ఉన్న ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం అమౌంట్‌లో గరిష్టంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story