EPFO: పెళ్లి ఖర్చులకు ఎంత మొత్తం పీఎఫ్ తీసుకోవచ్చు.? ఎలా అప్లై చేసుకోవాలి.?
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు అవసరమైన సమయంలో తమ పీఎఫ్ (PF) ఖాతా నుంచి అడ్వాన్స్‌గా డబ్బు తీసుకునే అవకాశం కల్పిస్తోందని తెలిసిందే.
EPFO: పెళ్లి ఖర్చులకు ఎంత మొత్తం పీఎఫ్ తీసుకోవచ్చు.? ఎలా అప్లై చేసుకోవాలి.?
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు అవసరమైన సమయంలో తమ పీఎఫ్ (PF) ఖాతా నుంచి అడ్వాన్స్‌గా డబ్బు తీసుకునే అవకాశం కల్పిస్తోందని తెలిసిందే. పెళ్లికి కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంత మొత్తం తీసుకోవచ్చు.? ప్రాసెస్ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి కోసం PF నుంచి ఎంత మొత్తం తీసుకోవచ్చు?
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం అర్హత ఉన్న సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో గరిష్టంగా 75 శాతం వరకు అడ్వాన్స్‌గా ఉపసంహరించుకోవచ్చు. అయితే సభ్యుడు ఈపీఎఫ్‌వో నిర్ణయించిన అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఎన్ని సార్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు?
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఉద్యోగి తన మొత్తం ఉద్యోగ కాలంలో గరిష్టంగా ఐదు సార్లు పెళ్లి అవసరాల కోసం పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంది. ప్రతి సారి నిర్ణీత నిబంధనలు పాటిస్తూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఎవరి పెళ్లికి PF అడ్వాన్స్ తీసుకోవచ్చు?
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం కేవలం ఉద్యోగి తన పెళ్లికే కాకుండా కుటుంబ సభ్యుల పెళ్లి కోసం కూడా పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇందులో తమ పెళ్లి, కుమారుడి పెళ్లి, కుమార్తె పెళ్లి, సోదరుడి పెళ్లి, సోదరి పెళ్లి కోసం ఈ సదుపాయం వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌లో PF అడ్వాన్స్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?
మీ UAN యాక్టివ్‌గా ఉండి, KYC పూర్తి అయి ఉంటే ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా EPFO సభ్యుల ఈ-సేవ పోర్టల్‌లోకి వెళ్లి UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. అనంతరం Online Services విభాగంలో Claim (Form-31, Form-19 & Form-10C) సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించి Proceed for Online Claimపై క్లిక్ చేయాలి. అక్కడ Form-31 ఎంచుకుని Purpose of Advanceలో Marriage ఎంపిక చేసి అవసరమైన మొత్తాన్ని నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ చేసేందుకు కొన్ని కీలక పత్రాలు సిద్ధంగా ఉండాలి. యాక్టివ్ UAN, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో వివాహా ఆహ్వాన పత్రికను కూడా ఆధారంగా అప్‌లోడ్ చేయాల్సి రావచ్చు. అందువల్ల దానిని ముందుగానే స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.




