EPFO: ఎట్టకేలకు శుభవార్త వచ్చేసింది.. ATM, UPI ద్వారా పీఎఫ్ డబ్బులు. ఎప్పటినుంచంటే.?

EPFO: దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) త్వరలో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

Mokshith
Published on: 20 Jun 2026 11:05 AM IST
EPFO
X

EPFO: ఎట్టకేలకు శుభవార్త వచ్చేసింది.. ATM, UPI ద్వారా పీఎఫ్ డబ్బులు. ఎప్పటినుంచంటే.?

EPFO: దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) త్వరలో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, PF ఖాతాలో ఉన్న డబ్బును ATM, UPI ద్వారా సులభంగా ఉపసంహరించుకునే అవకాశం లభిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సదుపాయం జూన్ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

PF డబ్బులు ఉపసంహరణకు కొత్త విధానం:

ప్రస్తుతం PF డబ్బులు తీసుకోవాలంటే ఆన్లైన్ క్లెయిమ్ లేదా ఇతర ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. అయితే కొత్త వ్యవస్థ ద్వారా సభ్యులు తమ PF ఖాతాలోని నిధులను నేరుగా UPI సాయంతో బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకుని, తర్వాత ATM ద్వారా నగదు తీసుకునే అవకాశం పొందుతారు. కార్మిక శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సేవ ప్రారంభానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కొత్త "2.01 సర్వర్" పూర్తిగా పనిచేయడం ప్రారంభమైన వెంటనే ఈ సేవ అందుబాటులోకి రానుంది.

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఏమన్నారు?

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా గత మే నెలలోనే ఈ మార్పు గురించి సంకేతాలు ఇచ్చారు. జూన్ నుంచి PF ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

PF ఖాతాదారులు తమ సొంత డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడం, పెద్దపెద్ద ఫామ్ లు నింపే ఇబ్బందిని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. దీనిలో భాగంగానే EPFO పూర్తి డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది.

UPI, ATM ద్వారా ఎంత మొత్తం తీసుకోవచ్చు?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ATM లేదా UPI ద్వారా ఉపసంహరించుకునే మొత్తం PF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్లో గరిష్టంగా 50 శాతం వరకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై EPFO నుంచి అధికారిక మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. సేవ ప్రారంభమైన తర్వాత ఖచ్చితమైన పరిమితులు ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సదుపాయం పొందాలంటే ఏమేమి అవసరం?

PF ఖాతాను UPIతో అనుసంధానం చేసుకోవాలంటే కొన్ని కీలక అర్హతలు తప్పనిసరి.

* యాక్టివ్ UAN (Universal Account Number) ఉండాలి.

* ఆధార్, PAN, బ్యాంకు ఖాతా వివరాలు UANతో లింక్ అయి ఉండాలి.

* బ్యాంకు ఖాతాకు IFSC కోడ్ నమోదు చేసి ఉండాలి.

* మొబైల్ నంబర్ ఆధార్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలి.

* OTP ఆధారిత ధృవీకరణ కోసం మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి.

త్వరలో EPFO పోర్టల్ లేదా UMANG యాప్లో "UPIతో PF లింక్ చేయండి" లేదా "UPI ద్వారా PF విత్డ్రా" వంటి కొత్త ఆప్షన్లు కనిపించే అవకాశం ఉంది. అక్కడ UPI ID నమోదు చేసి అనుమతి ఇస్తే PF ఖాతా UPIతో లింక్ అవుతుంది.

పూర్తి PF మొత్తం ఎప్పుడు తీసుకోవచ్చు?

సాధారణంగా ఉద్యోగి 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం PF డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా పూర్తి మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పుడు, విదేశాలకు శాశ్వతంగా వెళ్లినప్పుడు, రిటైర్మెంట్ నిధుల రక్షణకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితుల్లో EPFO నిబంధనల ప్రకారం పూర్తి PF మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది.

ఉద్యోగులకు పెద్ద ఊరట:

ATM, UPI ద్వారా PF డబ్బులు ఉపసంహరించుకునే సదుపాయం అమల్లోకి వస్తే, కోట్లాది మంది ఉద్యోగులకు ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది. క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, అత్యవసర సమయంలో నిధులు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. డిజిటల్ సేవలను మరింత విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో ఇది మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story