EPFO: పీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలెర్ట్ ..ఇలా చేస్తే ఖాతా ఖాళీ..

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులను ముంచెత్తుతున్న నకిలీ లింకులు. అసలైన వెబ్‌సైట్లను ఎలా గుర్తుపట్టాలి?

Naresh.k
Published on: 11 Aug 2026 9:42 AM IST
EPFO
X

EPFO: పీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలెర్ట్ ..ఇలా చేస్తే ఖాతా ఖాళీ..

PF Fraud: దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్ల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఖాతా ఒక కొండంత అండ. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, డబ్బులు విత్‌డ్రా చేయడం, కేవైసీ అప్‌డేట్ లేదా అకౌంట్ ట్రాన్స్‌ఫర్.. ఇలా ప్రతి చిన్న అవసరానికి ఉద్యోగులు పీఎఫ్ పోర్టల్‌పైనే ఆధారపడతారు. అయితే, ఈ అవసరాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పేరుతో, అసలైన పీఎఫ్ సైట్‌లాగే కనిపించే నకిలీ లింకులను నెట్టింట చక్కర్లు కొట్టిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో EPFO ఎక్స్‌ వేదికగా ఉద్యోగులకు అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది.

ఇటీవలి కాలంలో వాట్సాప్, ఎస్‌ఎమ్‌ఎస్, ఈమెయిల్‌ లేదా సోషల్ మీడియా ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి లేదా వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ నకిలీ లింకులు పంపుతున్నారు. అవి నిజమైన వెబ్‌సైట్లేనని భావించి ఉద్యోగులు తమ వివరాలు ఎంటర్ చేయగానే, పీఎఫ్ ఖాతా వివరాలతో పాటు బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము కూడా ఖాళీ అవుతోంది.ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం.. క్రింద పేర్కొన్న యూఆర్‌ఎల్‌లు మాత్రమే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు. వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

డొమైన్ చివర .gov.in అని ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోండి. నకిలీ వెబ్‌సైట్లలో స్పెల్లింగ్ పొరపాట్లు ఉంటాయి. మెసేజ్‌లు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. పీఎఫ్ సంస్థ ఎప్పుడూ మీ UAN నంబర్, పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, లేదా ఓటీపీలను ఫోన్ కాల్స్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా అడగదు. ఏదైనా అనుమానాస్పద లింక్ లేదా మెసేజ్ వస్తే వెంటనే EPFO హెల్ప్‌డెస్క్‌ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి. చివరిగా.. ఆన్‌లైన్‌లో ఏ లింక్ క్లిక్ చేసేముందైనా ఒక్క క్షణం ఆలోచించండి.


https://www.epfo.gov.in https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story