EPFO: ఎట్ట‌కేల‌కు వ‌చ్చేస్తోంది.. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Mokshith
Published on: 21 April 2026 5:18 PM IST
EPFO
X

EPFO: ఎట్ట‌కేల‌కు వ‌చ్చేస్తోంది.. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసుకోవడానికి రోజులు వేచి చూడాల్సిన అవసరం తగ్గేలా, యూపీఐ ఆధారిత విత్‌డ్రా విధానాన్ని తీసుకురానుంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, డబ్బులు వేగంగా ఖాతాలోకి చేరే అవకాశముంది.

మే నుంచి ప్రారంభం.. ఎందుకు ఆలస్యం?

మొదట ఈ సదుపాయం మార్చి చివర్లోనే అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే సాంకేతిక అప్‌డేట్లు, సిస్టమ్ ఇంటిగ్రేషన్ పనుల వల్ల ఆలస్యం జరిగింది. తాజా సమాచారం ప్రకారం, 2026 మే నెలలో ఈ ఫీచర్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త విధానం ప్రారంభమైతే, క్లెయిమ్ ప్రాసెస్ మరింత వేగంగా మారుతుంది.

UPI ద్వారా ఎంత వరకు డబ్బులు తీసుకోవచ్చు?

కొత్త విధానంలో పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో సుమారు 75 శాతం వరకు యూపీఐ ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకునే వీలు ఉండొచ్చు. ఇది ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు త్వరితగతిన నగదు అందేలా సహాయపడుతుంది.

క్లెయిమ్ ప్రాసెస్‌లో పెద్ద మార్పులు

ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు కొంత సమయం పడుతుంది. కానీ యూపీఐ విత్‌డ్రా విధానం అమల్లోకి వస్తే. ప్రాసెస్ వేగవంతం అవుతుంది, మధ్యలో ఉండే ఆలస్యాలు తగ్గుతాయి, నేరుగా బ్యాంక్/యూపీఐ ద్వారా డబ్బులు అందుతాయి. ఇది మొత్తం వ్యవస్థను డిజిటల్ వైపు మరింత ముందుకు తీసుకెళ్తుంది..

2025-26 వడ్డీ రేటు.. సభ్యులకు లాభం

2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వార్షిక వడ్డీ రేటును సిఫార్సు చేశారు. ఈ రేటు ఉద్యోగుల పొదుపుకు మంచి రాబడిని అందించేలా ఉంటుంది. దీని వల్ల పీఎఫ్‌పై నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంది.

కొత్త స్కీమ్‌లు, డిజిటల్ మార్పులు

ఈపీఎఫ్ఓ తన పాత ఐటీ వ్యవస్థను పూర్తిగా మార్చి, ఆధునిక కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ (CITES 2.0) వైపు వెళ్తోంది. ఇందులో భాగంగా EPF స్కీమ్ 2026, EPS (పెన్షన్) స్కీమ్ 2026, EDLI (ఇన్సూరెన్స్) స్కీమ్ 2026 అనే కొత్త పథకాలు అమల్లోకి రానున్నాయి. ఇవి సభ్యులకు మరింత భద్రత, పారదర్శకత కలిగించడమే లక్ష్యంగా రూపొందిస్తున్నారు.

EPFO పనితీరు.. రికార్డ్ స్థాయి వృద్ధి

గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ గణనీయమైన ఫలితాలు సాధించింది. రూ.3.35 లక్షల కోట్లకు పైగా విరాళాలు సేకరించింది. 1.22 కోట్ల కొత్త సభ్యుల నమోదయ్యారు. 81 లక్షలకుపైగా పెన్షనర్లకు సేవలు అందాయి. 6 కోట్లకు పైగా క్లెయిమ్‌ల పరిష్కారం అయ్యింది. అదే సమయంలో, చిన్న మొత్తాలు ఉన్న నిరుపయోగ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించేందుకు ఆమోదం లభించింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story