Ethanol: త్వరలో ఇథనాల్ స్టవ్‌లు, ఏటీఎంలు! ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా సరికొత్త విధానం..
Ethanol: ఎల్‌పీజీ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను వంట గ్యాస్ ఫ్యూయల్‌గా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా తయారు చేసిన స్టవ్‌లలో వాడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఇథనాల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
Ethanol: త్వరలో ఇథనాల్ స్టవ్‌లు, ఏటీఎంలు! ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా సరికొత్త విధానం..
Ethanol: భారతదేశంలో పర్యావరణహిత ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం గృహాల్లో వినియోగిస్తున్న ఎల్‌పీజీ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను వంట గ్యాస్ ఫ్యూయల్‌గా ప్రవేశపెట్టేందుకు భారీ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం ద్వారా E20 పెట్రోల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ప్రొడక్షన్ భారీగా పెరగడంతో, దాని వినియోగానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా తయారు చేసిన స్టవ్‌లలో వాడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఇథనాల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిద్వారా ప్రజలకు సులభంగా ఇథనాల్ ఇంధనం అందుబాటులోకి వస్తుంది. కేవలం వంట రంగానికే కాకుండా, భవిష్యత్తులో వాహనాలు, కుకింగ్, ఏవియేషన్ ఫ్యూయల్స్ వంటి వివిధ రంగాలకు కూడా ఇథనాల్ వాడకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇథనాల్ వాడకం పెరగడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
కాగా, ఈ సరికొత్త ఇథనాల్ స్టవ్‌లు, ఏటీఎంల ఏర్పాటు సాకారమైతే గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ఉత్పత్తిదారులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు వెలువడే అవకాశం ఉంది. హరిత ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న ఈ అడుగులు దేశ భవిష్యత్తును మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.




