August 1: ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబుకు చిల్లు..!
August 1: ఆగస్టు 1 నుంచి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ సర్వీస్ ఛార్జీలకు సంబంధించి పలు కీలక ఆర్థిక నిబంధనలు మారబోతున్నాయి.
August 1: ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబుకు చిల్లు..!
Financial Changes: మరో కొత్త నెల తలుపు తడుతోంది. ప్రతినెల ప్రారంభంలో లాగే, ఆగస్టు 1 నుంచి కూడా మన దైనందిన ఆర్థిక కార్యకలాపాలను, బ్యాంకింగ్ వ్యవహారాలను ప్రభావితం చేసే పలు కీలక నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ సర్వీస్ ఛార్జీల నుంచి క్రెడిట్ కార్డులు, ఈకేవైసీ ప్రక్రియల వరకు అమల్లోకి రానున్న ఆ కీలక మార్పులపై ఓ సారి దృష్టి సారిద్దాం.
ఆర్బీఐ (తాజా నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలను లెక్కించేటప్పుడు, చెల్లించని కన్వీనియన్స్ ఫీజులు, జరిమానాలు మరియు పన్నులను బకాయిలతో చేర్చకూడదు.దీనివల్ల బిల్లు మొత్తాన్ని బదిలీ చేసే కస్టమర్లపై అదనపు వడ్డీ భారం లేదా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. దీనితో పాటు, కొన్ని బ్యాంకులు ఆగస్టు నుంచి క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, వార్షిక రుసుములు ఇతర ఛార్జీలను సవరించనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి సెంట్రలైజ్డ్ ఈకేవైసీ వ్యవస్థ 2.0ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ప్రతిసారీ బ్యాంక్ ఖాతా తెరిచినా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లు పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. మీ అనుమతితో బ్యాంకులు, బ్రోకరేజీ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కేంద్రీకృత డేటాబేస్ నుంచి మీ వివరాలను నేరుగా సేకరిస్తాయి. రోజుల తరబడి పట్టే ఈ ప్రక్రియ ఇకపై కొద్ది నిమిషాల్లోనే సులభంగా పూర్తవుతుంది. భవిష్యత్తులో బీమా సంస్థలు కూడా ఈ వ్యవస్థలో చేరనున్నాయి.
ఆగస్టు 1 నుంచి కొన్ని బ్యాంకులు తమ సేవా రుసుములను మార్చాయి. ఉదాహరణకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ ఎస్ఎమ్‌ఎస్ అలర్ట్ ఛార్జీలను సవరించింది. ఆగస్టు నుంచి పంపే ప్రతి ఎస్ఎమ్‌ఎస్‌కు 30 పైసలు చొప్పున వసూలు చేయనుంది. బ్యాంక్ రుణగ్రహీతలకు, డిపాజిటర్లకు అత్యంత కీలకమైన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్ట్ 3 నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ఆగస్ట్ 5న ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.
ఈ సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేట్లలో మార్పులు చేస్తే... మీరు చెల్లించే హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కొత్త నెల ప్రారంభంలో మీ ఆర్థిక ప్రణాళికలను ఈ మార్పులకు అనుగుణంగా రీ-చెట్ చేసుకోండి. ముఖ్యంగా ఐటీఆర్ ఫైలింగ్ బకాయిలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.




