Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బాంగ్ దీపావళి సేల్ 2026 షురూ.. స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు

Flipkart Diwali Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో భారీ సేల్‌ను ప్రకటించింది.

CR Reddy
Published on: 27 Oct 2026 8:20 AM IST
Flipkart Diwali Sale
X

Flipkart Diwali Sale

Flipkart Diwali Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో భారీ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బాంగ్ దీపావళి సేల్ 2026 అక్టోబర్ 28వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. పండుగ షాపింగ్ చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక ల్యాండింగ్ పేజీని కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు తో పాటు స్మార్ట్‌వాచ్‌లపై భారీ తగ్గింపులు లభించనున్నాయి.

ఐఫోన్ 17, శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు

ఈ పండుగ సేల్‌లో టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై విశేషమైన తగ్గింపులు లభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. లేటెస్ట్ ఐఫోన్ 17, శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE మోడళ్లతో పాటు ఒప్పో K14x 5G, వివో T5 లైట్, పోకో X8 పవర్, రియల్‌మీ P4 పవర్ 5G, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో, నథింగ్ ఫోన్ 4a వంటి క్రేజీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కలిపి కస్టమర్లు తమకు నచ్చిన ఫోన్‌లను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

ఎస్‌బీఐ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్

కొనుగోలుదారుల కోసం బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో షాపింగ్ చేసే వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. కార్డ్ ఈఎమ్‌ఐ లావాదేవీలకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీనితో పాటు రూ.2 లక్షల వరకు క్రెడిట్ పరిమితి, అదనపు వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఉపయోగించే కొనుగోలుదారులకు రూ.1,000 వరకు ప్రత్యక్ష తగ్గింపు అందుతుంది.

గంట గంటకూ మారే టిక్ టాక్ డీల్స్

ఈ సేల్ వ్యవధిలో సమయాన్ని బట్టి ఆఫర్లు పొందేలా ప్రత్యేక టైమ్ స్లాట్లను ఫ్లిప్‌కార్ట్ డిజైన్ చేసింది. టిక్ టాక్ డీల్స్ పేరుతో ప్రతి గంటకూ సరికొత్త ఆఫర్లు ప్రత్యక్షమవుతాయి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఫెస్టివ్ బెస్ట్‌సెల్లర్స్, సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ప్రైస్ క్రాష్, రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో పటాకా డీల్స్ అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య బిగ్ బాంగ్ అవర్స్ పేరుతో అత్యంత తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయించనున్నారు.

ల్యాప్‌టాప్‎ల పై ప్రత్యేక ఆఫర్లు

ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్ కేటగిరీలో హెచ్‌పి 15 ల్యాప్‌టాప్, శామ్‌సంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్‌లపై బంపర్ డిస్కౌంట్లు లభించనున్నాయి. హోమ్ అప్లయన్సెస్ విభాగంలో పెద్ద స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. అయితే ప్రతి వస్తువు తుది ధర అనేది మోడల్, వేరియంట్, ఎంచుకునే బ్యాంక్ ఆఫర్ అలాగే పాత వస్తువు ఎక్స్ఛేంజ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని, కొనుగోలు చేసేముందు నిబంధనలు సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.