Indian Railways: టికెట్ అక్కర్లేదు.. జరిమానా ఉండదు.. దేశంలోనే ఏకైక ఉచిత రైలు!

Free Train Travel in India: భారతీయ రైల్వేలో ఉచిత ప్రయాణం సాధ్యమేనా? అవును, భక్రా-నంగల్ డ్యామ్ మార్గంలో నడిచే ఈ ప్రత్యేక రైలులో ప్రయాణానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

Arun Chilukuri
Published on: 13 April 2026 12:50 PM IST
Free Train Travel in India
X

Indian Railways: టికెట్ అక్కర్లేదు.. జరిమానా ఉండదు.. దేశంలోనే ఏకైక ఉచిత రైలు!

Free Train Travel in India: భారతీయ రైల్వే అనగానే జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు.. భారీగా పెరిగిన టికెట్ ధరలు గుర్తొస్తాయి. టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలు తప్పవు. కానీ, అచ్చం మన దేశంలోనే ఒక ప్రత్యేక రైలు ఉంది. ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒక్క రూపాయి కూడా టికెట్ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే భక్రా-నంగల్ ఉచిత రైలు.

ఈ రైలు ప్రత్యేకతలు:

హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ సరిహద్దుల్లోని భక్రా-నంగల్ డ్యామ్‌ను చూడటానికి వచ్చే పర్యాటకులు, స్థానికుల కోసం ఈ రైలును ఉచితంగా నడుపుతున్నారు.

ఈ రైలును గత 70 ఏళ్లుగా నడుపుతున్నారు. ఆనకట్ట నిర్మాణ సమయంలో కార్మికులను, సామాగ్రిని తరలించడానికి దీన్ని ప్రారంభించారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నేటికీ ఉచితంగానే కొనసాగిస్తున్నారు.

సట్లెజ్ నది మరియు శివాలిక్ కొండల అందాల గుండా ఈ రైలు సుమారు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఆధునిక రైళ్లకు భిన్నంగా ఈ రైలు కోచ్‌లు పూర్తిగా చెక్కతో తయారు చేయబడ్డాయి. నేటికీ ఇది డీజిల్ ఇంజన్‌తోనే నడుస్తుంది.

పర్యాటకుల కోసం స్పెషల్:

ప్రతిరోజూ సుమారు 800 మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, పర్యాటకులు ఆనకట్టను సందర్శించడానికి ఈ ఉచిత సేవను ఉపయోగిస్తారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్దది అయినప్పటికీ, ఇలాంటి చారిత్రక మరియు వినూత్న సేవలు పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తెస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story