Rehaan Healthcare: రీహాన్ హెల్త్‌కేర్‌కు షాక్.. తయారీ లైసెన్స్ సస్పెండ్
నిబంధనల ఉల్లంఘనలతో రీహాన్ హెల్త్‌కేర్ తయారీ లైసెన్స్‌ను FSSAI సస్పెండ్ చేసింది. లోపాలు సరిచేసే వరకు ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది.
FSSAI Suspends Rehaan Healthcare Manufacturing Licence
ఆరోగ్య సప్లిమెంట్లు, న్యూట్రాస్యూటికల్స్ తయారీలో నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు గుర్తించిన నేపథ్యంలో రీహాన్ హెల్త్‌కేర్‌పై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీ తయారీ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తయారీ నిలిపివేయాలని ఆదేశాలు
రీహాన్ హెల్త్‌కేర్ డైజెస్టివ్ సిరప్, మల్టీ విటమిన్ సిరప్‌తో పాటు ఇతర సిరప్ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేస్తోంది. తయారీ యూనిట్‌లో తీవ్ర లోపాలు గుర్తించిన FSSAI, అన్ని లోపాలను సరిదిద్దే వరకు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీని ఆదేశించింది.
లోపాల సవరణ తర్వాతే అనుమతి
గుర్తించిన అన్ని లోపాలను సరిచేసి, సంబంధిత అధికారుల తనిఖీలో అవి సక్రమంగా సవరించినట్లు నిర్ధారణ అయిన తర్వాతే తయారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి లభిస్తుందని FSSAI స్పష్టం చేసింది.
ఆదేశాల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు
లైసెన్స్ సస్పెన్షన్ ఉత్తర్వులను ఉల్లంఘించి ఉత్పత్తి కొనసాగిస్తే కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని FSSAI హెచ్చరించింది. నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సంస్థ స్పష్టం చేసింది.




