Petrol- Diesel Price Today : భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. బండి తీయాలంటే సామాన్యుడికి చుక్కలే

Petrol- Diesel Price Today : జూన్ 30న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబైల నుంచి హైదరాబాద్, పట్నా వరకు నేటి తాజా ఇంధన ధరల వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 30 Jun 2026 7:43 AM IST
Petrol- Diesel Price Today
X

Petrol- Diesel Price Today 

Petrol- Diesel Price Today : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, దేశీయంగా ఇంధన ధరల మోత సామాన్యుడికి అస్సలు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. జూన్ 30, 2026 నాటికి కూడా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా స్థిరంగా కొనసాగుతున్నాయి.

అయితే మే, జూన్ నెలల్లో చమురు కంపెనీలు భారీగా ధరలను పెంచడంతో ఇప్పటికే సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టినా, ఆ ప్రయోజనాన్ని మాత్రం సామాన్య వినియోగదారులకు చేరవేయకపోవడం గమనార్హం. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం అంతర్జాతీయ ముడిచమురు రేట్లపైనే కాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, రవాణా ఖర్చులు, డీలర్ల కమీషన్లపై ఆధారపడి ఉంటాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త నలిగినా, స్థానిక పన్నుల భారం వల్ల మన జేబులపై పడే భారం మాత్రం తగ్గడం లేదు.

గరాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు (లీటరుకు రూపాయలలో)

మన దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు లీటరు పెట్రోల్ ధర 102.12 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 95.20 రూపాయల వద్ద విక్రయించబడుతోంది. ఐటి హబ్ అయిన హైదరాబాద్ విషయానికి వస్తే, ఇక్కడ భాగ్యనగర వాహనదారులకు ఇంధన ధరల భారం కాస్త ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర 115.73 రూపాయలు కాగా, డీజిల్ ధర 103.82 రూపాయల వద్ద అత్యధికంగా కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 111.21 రూపాయలుగా, డీజిల్ రేటు 97.83 రూపాయలుగా రికార్డైంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో లీటరు పెట్రోల్ కొనాలంటే 107.77 రూపాయలు, డీజిల్ కోసం 99.55 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. బీహార్ రాజధాని పట్నాలో పెట్రోల్ ధర 113.37 రూపాయలు కాగా, డీజిల్ ధర 99.36 రూపాయల వద్ద విక్రయించబడుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పెట్రోల్ 101.86 రూపాయలు, డీజిల్ 95.36 రూపాయలుగా ఉంది. అలాగే ఐటి సిటీ బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర 110.82 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 98.77 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నేడు లీటరు పెట్రోల్ కొనుగోలుకు 113.51 రూపాయలు, డీజిల్ కొనుగోలుకు 99.82 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story