Gold Rate Toaday : కుప్పకూలిన బంగారం ధరలు.. నిన్న ఒక్కరోజే రూ.10 వేలకు పైగా తగ్గుదల
Gold Rate Toaday : మార్చి 24న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం రూ. 1,24,340 ఉండగా, వెండి కిలోకు రూ. 15,000 తగ్గి రూ. 2,29,900 కి చేరింది.
Gold Rate Toaday : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పుల వల్ల పసిడి ప్రేమికులకు ఊరట లభిస్తోంది. 1983 తర్వాత అత్యంత దారుణమైన వారంగా నమోదైన గడిచిన కొద్ది రోజుల్లో బంగారం ధరలు దాదాపు 11 శాతం మేర నష్టపోయాయి. ఈ రోజు మార్చి 24, 2026 నాటి అప్డేట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల పసిడిపై సుమారు రూ.10,320 మేర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు పసిడి ధరలు దాదాపు ఒకే తీరుగా కొనసాగుతున్నాయి. భాగ్యనగరం హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,640 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,24,340 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ధర స్వల్పంగా ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,35,790 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,490 వద్ద ఉంది. ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ హబ్ బెంగళూరులో హైదరాబాద్ తరహాలోనే ధరలు నమోదయ్యాయి. అయితే చెన్నైలో మాత్రం పసిడి ధర కాస్త ప్రియంగానే ఉంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,39,190 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే కిలో వెండిపై సుమారు రూ.15,000 మేర తగ్గడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గడిచిన కొద్ది వారాల్లో బంగారం ధరలు 12 నుంచి 17 శాతం వరకు తగ్గాయి. ఫిబ్రవరిలో మొదలైన ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకినా, ఇప్పుడు మార్కెట్ సద్దుమణుగుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా ఫ్యూచర్స్ కాంట్రాక్టులు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సామాన్యులు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నప్పటికీ, ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా అనేది అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు స్థానిక జ్యువెలరీ షాపుల్లో హాల్‌మార్క్ రేట్లను సరిచూసుకోవడం ఉత్తమం.




