Gold Rate Today: యుద్ధం భయం.. రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి.
Gold Rate Today
Gold Rate Today: అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులు రోజురోజుకూ పసిడి, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. మునుపెన్నడూ లేని రీతిలో గోల్డ్ రేట్లు గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430కి చేరుకోగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,46,160 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,620గా నమోదు కావడం విశేషం. అదే సమయంలో ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.1,59,280 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,010గా ఉంది. అహ్మదాబాద్ నగరంలో 24 క్యారెట్ల రేటు రూ.1,59,330 ఉంటే, 22 క్యారెట్ల రేటు రూ.1,46,060 వద్ద విక్రయమవుతోంది. చెన్నై, కోల్‌కతా, కేరళ రాష్ట్రాల్లోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,280గా నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నింట్లోనూ పసిడి రేట్లు ఒకే స్థాయిలో నిలకడగా కొనసాగుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 వద్ద వ్యాపారం జరుగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,010 కాగా, 18 క్యారెట్ల రేటు రూ.1,19,470 వద్ద నిలిచింది. పసిడి ప్రియులకు మాత్రమే కాకుండా సాధారణ కొనుగోలుదారులకు కూడా ఈ ధరల పెంపు పెద్ద భారాన్ని మోపుతోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రముఖ నగరాల్లోనూ గోల్డ్ రేట్లు తెలంగాణతో సమానంగా కొనసాగుతున్నాయి. ఈ నగరాలన్నింటిలోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,46,010గా ఉంది. అలాగే 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,19,470గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పరుగులు పెడుతోంది. మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,60,100కి పెరిగి రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.




