Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు

Gold Price Today: బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులకు పెద్ద ఊరట లభించింది.

CR Reddy
Published on: 12 Sept 2026 7:31 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today: బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులకు పెద్ద ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల గోల్డ్ రేట్లు పతనమయ్యాయి. పండుగల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఎంతో ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఊగిసలాట ధోరణిలో సాగిన పుత్తడి రేట్లు వారం చివరి నాటికి మరింత కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన ఒత్తిడి, యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీనివల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ప్రియులకు కొనుగోలు చేసేందుకు చక్కటి అవకాశం ఏర్పడింది.

దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా గోల్డ్ రేట్లు తగ్గుదల బాట పట్టాయి. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర రూ.1,54,420 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.1,41,550 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లోనూ అచ్చం ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,420 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,550గా నమోదయింది. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలలో కూడా గోల్డ్ రేట్లు ఇదే వరుసలో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు స్వల్ప వ్యత్యాసంతో కొనసాగుతోంది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాటలోనే పయనిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కిలో వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ముంబై, ఢిల్లీ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద లభిస్తుండగా, హైదరాబాద్ అలాగే చెన్నై నగరాలలో కిలో సిల్వర్ ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.