Gold Rate Today : గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today : ఏప్రిల్ 21, మంగళవారం నాడు బులియన్ మార్కెట్‌లో ధరల సరళిని పరిశీలిస్తే కొనుగోలుదారులకు కొంత ఊరట లభించిందనే చెప్పాలి.
Gold Rate Today
Gold Rate Today : బంగారం, వెండి అంటే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. ఏప్రిల్ 21, మంగళవారం నాడు బులియన్ మార్కెట్‌లో ధరల సరళిని పరిశీలిస్తే కొనుగోలుదారులకు కొంత ఊరట లభించిందనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు, అమెరికా డాలర్ బలపడటం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
భాగ్యనగరంలో బంగారం ధరలు మంగళవారం నాడు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,55,280 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ. 1,42,340 వద్ద ట్రేడవుతోంది. చిన్నపాటి ఆభరణాల కోసం వాడే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,460 గా ఉంది. గత రెండు మూడు రోజులతో పోలిస్తే రేట్లు కొంత మేర దిగిరావడంతో నగరంలోని జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు హైదరాబాద్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల పసిడి రూ.1,55,430 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,490 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌తో సమానంగా రూ.1,55,280 (24 క్యారెట్లు), రూ.1,42,340 (22 క్యారెట్లు) గా ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం పసిడి ప్రియులకు కొంత భారం తప్పడం లేదు, అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,55,990 గా ఉండటం గమనార్హం.
వెండి ధరల విషయంలో మాత్రం ఇన్వెస్టర్లు షాక్‌కు గురవుతున్నారు. గతంలో కిలో వెండి ధర ఏకంగా రూ.4 లక్షల మార్కును తాకగా, ఇప్పుడు అది భారీగా దిగివచ్చింది. హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద ఉంది. అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో చూస్తే కిలో వెండి రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపు లక్ష రూపాయలకు పైగానే వెండి ధర పడిపోవడం విశేషం. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే అయినా, కొత్తగా కొనేవారికి మాత్రం ఇది అద్భుతమైన అవకాశం.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమవుతున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను కొంతమేర ఉపసంహరించుకుంటున్నారు. అలాగే పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, కామెక్స్ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 4,821 డాలర్లకు, వెండి ఔన్సుకు 80.16 డాలర్లకు తగ్గడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.




