Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి.

CR Reddy
Published on: 17 Sept 2026 7:03 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today: బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న గోల్డ్ రేట్లు తాజాగా మరోసారి భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాల కారణంగానే పసిడి ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ పెరగడంతో ఆభరణాల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే రానున్న రెండు మూడు వారాల్లో మార్కెట్ పరిస్థితిని బట్టి ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నేటి బంగారం ధరల పెరుగుదల వివరాలు

తాజా మార్కెట్ నివేదికల ప్రకారం.. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 మేర పెరగగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై రూ. 250 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర 4,326 డాలర్ల వద్ద ట్రేడవుతుండటం దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. మరోవైపు, వెండి ధరలు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నమోదైన 24 క్యారెట్లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల వివరాలు కింద విధంగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,53,450 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,40,660 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,53,450, అలాగే 22 క్యారెట్ల ధర రూ. 1,40,660గా ఉంది. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,53,600 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,40,810 వద్ద ఉంది. ముంబై, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ. 1,53,450, 22 క్యారెట్ల ధర రూ. 1,40,660 వద్ద ట్రేడవుతోంది.బెంగళూరు, కోల్‌కతాలలో ఇక్కడ కూడా 24 క్యారెట్ల ధర రూ. 1,53,450 , 22 క్యారెట్ల ధర రూ. 1,40,660గా నమోదైంది. అలాగే కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,44,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.