Gold Rate Today : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today : నేటి (ఏప్రిల్ 25, 2026) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం లక్షన్నర దాటేసింది. వెండి కూడా షాకిస్తోంది.

CR Reddy
Published on: 25 April 2026 6:58 AM IST
Gold Rate Today
X

Gold Rate Today 

Gold Rate Today : భారతీయ మార్కెట్లో పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నిన్నటితో పోలిస్తే నేడు (ఏప్రిల్ 25, 2026) పసిడి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నేరుగా పసిడి ధరలపై పడుతోంది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పసిడి ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.1,54,050 గా నమోదైంది. నిన్న ఇదే ధర రూ.1,52,950 వద్ద ఉండగా, ఒక్క రోజే రూ.1,100 పెరగడం గమనార్హం. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.1,41,210 వద్ద కొనసాగుతోంది. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పెంపు సామాన్య ప్రజలపై తీరని భారాన్ని మోపుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇతర నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల బంగారం రూ.1,54,200 కు చేరుకోగా, 22 క్యారెట్లు రూ.1,41,360 వద్ద విక్రయించబడుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో పసిడి ధరలు దాదాపు హైదరాబాద్ ధరలకు సమానంగా అంటే రూ.1,54,050 (24 క్యారెట్లు) వద్ద ట్రేడ్ అవుతున్నాయి. స్థానిక పన్నులు, ఇతర ఖర్చుల వల్ల నగరాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. నేడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా రూ.2,64,900 కి చేరుకుంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,59,800 వద్ద కొనసాగుతోంది. వెండి వినియోగం పారిశ్రామికంగా పెరగడం, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండి వైపు మళ్లడం వల్ల ఈ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువలో మార్పులు, ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేసుకోవడం కూడా ధరలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. పసిడి ధరలు ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు కనిపించడం లేదని, భవిష్యత్తులో ఇవి రూ.1.60 లక్షల మార్కును కూడా దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story