Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,56,210 గా నమోదు కాగా, కిలో వెండి రూ.2,89,900 వద్ద కొనసాగుతోంది.
Gold Price Today
Gold Price Today : గత కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా పరుగెత్తిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ కారణాలు, ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో వస్తున్న ఆటుపోట్ల వల్ల ఒకరోజు స్థిరంగా ఉంటూ.. మరోరోజు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల కిందట ఏకంగా రూ.1.60 లక్షల ఆల్ టైమ్ రికార్డు మార్కును తాకిన తులం బంగారం ధర.. ఇప్పుడు క్రమంగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్రముఖ వెబ్‌సైట్ గుడ్ రిటర్న్స్ అందించిన తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,190 గా రికార్డయింది. గత వారంతో పోలిస్తే ఈ ధరలు కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పుడూ ఇతర నగరాల కంటే బంగారం ధర స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. తాజా మార్కెట్ అప్‌డేట్ ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,360 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,340 వద్ద ట్రేడవుతోంది.
దేశంలోని మిగిలిన మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో బంగారం ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. ఈ మూడు నగరాలలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 గా నమోదు కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190 వద్ద విక్రయించబడుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం మిగిలిన నగరాల కంటే బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. చెన్నై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,170 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,990 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడతో పాటు చెన్నై, కేరళ ప్రాంతాలలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర ఉత్తరాది ప్రాంతాలలో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ జూన్ నెల మొదటి రోజు నుంచే బంగారం, వెండి ధరల్లో భారీ పతనం ప్రారంభమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ప్రారంభ ట్రేడింగ్‌లోనే బంగారం ధరలు ఏకంగా రూ.1,500 కంటే ఎక్కువగా పడిపోగా.. వెండి ధరలు కూడా దాదాపు అదే స్థాయిలో తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండటమే ఈ పసిడి ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




