Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,560 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,090గా ఉంది.
Gold Price Today
Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడుతున్న పరిణామాల కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు నిత్యం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గురువారం అక్టోబర్ 8న బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు లోహాల రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల
దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గి రూ.1,49,560 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,37,090 వద్ద నమోదు నమోదైంది. కొనుగోలుదారులకు ఇది పెద్ద వ్యత్యాసంగా అనిపించకపోయినప్పటికీ, ధరలు మరింత పైకి చేరకుండా స్థిరంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.
వెండి కిలోపై రూ.100 తగ్గింపు
పసిడి బాటలోనే వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా కిలో వెండి ధరపై రూ.100 తగ్గి రూ.2,34,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. పరిశ్రమల నుంచి వస్తున్న డిమాండ్, అంతర్జాతీయంగా డిజిటల్ ఉత్పత్తుల వాడకం ఆధారంగా వెండి రేట్లలో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో రేట్లు
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,49,560 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,090 వద్ద ఉంది. ఇక్కడ స్థానిక పన్నుల కారణంగా కిలో వెండి ధర రూ.2,44,900గా కొనసాగుతోంది. ముంబై, బెంగళూరులలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,560, ఢిల్లీలో రూ.1,49,690 వద్ద విక్రయమవుతోంది.
ధరల్లో తేడాలకు గల కారణాలు
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి రేట్లు ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, రవాణా ఖర్చులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల ఆధారంగా నగరాల వారీగా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.




