Gold Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. దిగివచ్చిన బంగారం ధరలు!
Gold Price Today: గత కొద్దిరోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Gold Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. దిగివచ్చిన బంగారం ధరలు!
Gold Rate Today: గత కొంతకాలంగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు కాస్త శాంతిస్తున్నాయి. కొనుగోలుదారులను బెంబేలెత్తించిన బులియన్ మార్కెట్, ఇటీవల వరుసగా తగ్గుముఖం పడుతూ ఊరటనిస్తోంది.
అంతర్జాతీయంగా చోటుచేసుకున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గతంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. అయితే, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న తాజా పరిణామాలతో ఈ వారంలో ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం భారీగా తగ్గిన పసిడి రేట్లు, మంగళవారం కూడా అదే బాటలో స్వల్పంగా క్షీణించాయి.
బుధవారం, జులై 15వ తేదీ ఉదయం వివిధ ప్రముఖ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ప్రకారం దేశీయంగా పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై మరో రూ. 10 మేర తగ్గి, ప్రస్తుతం రూ. 1,42,790 వద్ద కొనసాగుతోంది. అలాగే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి రేటు కూడా 10 గ్రాములకు రూ. 10 మేర తగ్గి, రూ. 1,30,890 గా నమోదైంది. మరోవైపు వెండి ధరలలో ఎలాంటి మార్పు లేకుండా కిలో వెండి ధర రూ. 2,34,900 లు గా స్థిరంగా కొనసాగుతోంది.
అయితే, ఈ ధరలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్, సప్లై చైన్, ఆయా రాష్ట్రాలు విధించే స్థానిక పన్నులు , రవాణా ఖర్చుల ఆధారంగా నగరాల వారీగా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబై, ఢిల్లీ లేదా చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ధరలు స్వల్ప మార్పులతో ఉంటాయి. ఏదేమైనప్పటికీ బంగారం ధరలు ఇలా దిగిరావడం మధ్యతరగతి ప్రజలకు, పసిడి ప్రేమికులకు పెద్ద ఉపశమనమనే చెప్పాలి.




