Gold Rate Today: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. తులం బంగారం ఎంతో తెలుసా..?
Gold Rate Today: సెప్టెంబర్ 9న పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్, ఏపీ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,55,350కి చేరగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,42,400గా నమోదైంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. తులం బంగారం ఎంతో తెలుసా..?
Gold price: దేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరందుకున్న వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి మైండ్ బ్లాక్ చేశాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుండటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు శరవేగంగా దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 9న హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులంపై ఒక్కరోజే రూ.1,200 పెరిగి రూ.1,55,350 వద్దకు చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.1,42,400కి చేరింది. ఇక కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలలోనూ ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,100 పెరిగి రూ.1,42,400 వద్ద, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,200 పెరిగి రూ.1,55,350 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక్కడ కూడా కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా నమోదైంది.
ఒకవైపు దేశీయంగా ధరలు మండిపోతుంటే, గ్లోబల్ మార్కెట్లో మాత్రం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 46 డాలర్లు తగ్గి 4,365 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా ఔన్సుపై 0.58 శాతం తగ్గి 65.89 డాలర్ల వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ తగ్గుదల ప్రభావంతో రాబోయే సెషన్లలో దేశీయంగా కూడా పసిడి ధరలు మళ్లీ దిగివచ్చే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.




