Today Gold Rate: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ముట్టుకుంటే షాకే..!

Today Gold Rate: గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

Naresh.k
Published on: 18 March 2026 7:55 AM IST
Today Gold Rate
X

Today Gold Rate: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ముట్టుకుంటే షాకే..!

Today Gold Rate: సామాన్యుడి నుంచి పెట్టుబడిదారుల వరకు అందరి కళ్లూ ఇప్పుడు పసిడి వైపే ఉన్నాయి. గత వారం రోజులుగా ఇక బంగారం ధరలు దిగివస్తాయి.. సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి అని ఆశ పడుతున్న తరుణంలో, పసిడి ధరలు ఊహించని విధంగా యూ-టర్న్ తీసుకున్నాయి. వరుసగా ఆరు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడి, ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి.

యుద్ధ మేఘాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు. అయితే, మధ్యలో అమెరికా డాలర్ బలోపేతం కావడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సందిగ్ధత నెలకొనడంతో గత వారం రోజులుగా ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైమ్ హై స్థాయి నుంచి దాదాపు రూ. 20 వేల వరకు దిగివచ్చిన పసిడి, గడిచిన వారంలోనే తులంపై రూ. 5000 మేర తగ్గింది.

ఒక్కసారిగా భారీ పెరుగుదల

ధరలు ఇంకా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో, మార్కెట్ లెక్కలు తారుమారయ్యాయి. ఈరోజు దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 660 పెరిగి, ప్రస్తుతం రూ. 1,58,080 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి వాడే 916 ప్యూరిటీ బంగారం 10 గ్రాములపై రూ. 600 పెరిగి, రూ. 1,44,900 మార్కును చేరింది.

వరుస పతనం తర్వాత కనిష్ట ధరల వద్ద ఇన్వెస్టర్లు మళ్లీ భారీగా కొనుగోళ్లు జరపడం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్‌లో స్వల్ప మార్పులు కూడా పసిడికి మళ్లీ ఊపిరి పోశాయి. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఊహించడం నిపుణులకు కూడా సవాలుగా మారింది. ధరలు తగ్గుతున్నాయని సంబరపడే లోపే మళ్లీ పెరుగుదల బాట పట్టడం విశేషం. మరి ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా? లేక మళ్లీ దిగివస్తుందా? అనేది వేచి చూడాలి.

Naresh.k

Naresh.k

Next Story