Gold: టైం చూసి తగ్గుతోన్న గోల్డ్ ధర.. రూ. 1 లక్షకు చేరొచ్చంటున్న నిపుణులు.!
Gold: బంగారం ధరలు తగ్గుతున్న వేళ సమీపకాలంలో మరింత పతనం ఉండొచ్చని, టెక్నికల్ చార్టుల ప్రకారం రూ. 1.20 లక్షల కంటే తగ్గితే ధర రూ. 1 లక్షకు కూడా చేరొచ్చని, ధర తగ్గిన ప్రతిసారీ దశలవారీగా కొనడం మంచిదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold: టైం చూసి తగ్గుతోన్న గోల్డ్ ధర.. రూ. 1 లక్షకు చేరొచ్చంటున్న నిపుణులు.!
Gold: బంగారం ధరలు తగ్గుతున్న వేళ సమీపకాలంలో మరింత పతనం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్నికల్ చార్టుల ప్రకారం.. 'రూ. 1.28 లక్షల నుంచి రూ. 1.20 లక్షల మధ్య మద్దతు ఉండగా, రూ. 1.20 లక్షల కంటే తగ్గితే బంగారం ధర రూ.1 లక్షకు కూడా చేరొచ్చని అంచనా. ధరలు పెరగాలంటే రూ. 1.40 నుంచి రూ. 1.48 లక్షలకు పైన ఉండాలి. అంతర్జాతీయ అనిశ్చితులు వస్తే ధరలు పెరగవచ్చు. అందుకే ధర తగ్గిన ప్రతిసారీ దశలవారీగా కొనడం మంచిది' అని సూచిస్తున్నారు.
ఈ నెలలో బంగారం ధరలు వేగంగా పడిపోయాయి. నవంబర్ 10న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1.44 లక్షలు ఉండగా, నవంబర్ 18న రూ. 1.36 లక్షలకు, నవంబర్ 20న రూ. 1.33 లక్షలకు తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ధర నవంబర్ 21న రూ. 1,23,893గా నమోదైంది. ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే రూ. 5,638 పడిపోయింది. ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ సుమారు 4 శాతం తగ్గి రూ. 1,23,120 వద్ద ట్రేడ్ అయ్యాయి. వెండి ధర కూడా ఒక్క రోజులో 6 శాతం పైగా పడింది.
ఈ పతనం వెనుక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఆందోళనలు, బలపడుతున్న డాలర్, బిట్‌కాయిన్, స్టాక్స్‌తో పాటు బంగారం, వెండి కూడా ఒకేసారి పడిపోవడం ఇందుకు కారణమని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. మార్జిన్ కాల్స్ వల్ల ట్రేడర్లు బలవంతంగా అమ్మకాలు చేస్తున్నారా, లేదా ఇది బేర్ మార్కెట్ మొదలా అనే చర్చ కూడా నడుస్తోంది.
అయితే మరో కోణంలో చూసేవారు కూడా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్, పండుగ డిమాండ్ వంటి సీజనల్ కారణాలతో బంగారం మళ్లీ కోలుకునే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ధరలు పెరగాలంటే రూ. 1.40 నుంచి రూ. 1.48 లక్షల స్థాయికి పైన స్థిరపడాలని ఈ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరకు ఆ స్థాయికి చాలా దూరం ఉంది. ఈ పరిస్థితుల్లో కొనాలనుకునేవారు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనకుండా, ధర తగ్గిన ప్రతిసారీ కొద్దికొద్దిగా కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సాధారణ సమాచారం మాత్రమే, పెట్టుబడి సలహా కాదు. టెక్నికల్ అంచనాలు ఎల్లప్పుడూ నిజమవ్వవు. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి.




