Gold Rate Today: ఇక బంగారం కొనలేం.. చూడలేం.. ఆగస్టు 25 నాటి కొత్త పసిడి ధరలు ఇవే

Gold Rate Today: తాజా సమాచారం ప్రకారం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గణనీయంగా పెరిగింది. గ్రాము 24 క్యారెట్ల పసిడిపై రూ.89 పెరగడంతో దాని ధర రూ.16,397కి చేరింది.

CR Reddy
Published on: 25 Aug 2026 7:04 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడుతున్న పరిణామాల ప్రభావం దేశీయంగా బంగారం, వెండి ధరలపై తీవ్రంగా కనిపిస్తోంది. పసిడి ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులను తిరగరాస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. వారం ప్రారంభమైన తొలి రోజే పసిడి, వెండి రేట్లు మళ్లీ భారీగా పెరగడం గమనార్హం. గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతున్న ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గణనీయంగా పెరిగింది. గ్రాము 24 క్యారెట్ల పసిడిపై రూ.89 పెరగడంతో దాని ధర రూ.16,397కి చేరింది. ఫలితంగా తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 890 పెరిగి రూ. 1,63,980 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఒక తులం మేలిమి బంగారం కొనుగోలు చేయాలంటే వినియోగదారులు ఏకంగా రూ. 1,63,980 వరకు వెచ్చించాల్సి వస్తోంది.

22, 18 క్యారెట్ల ఆభరణాల బంగారం రేట్లు

ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే బాటలో పయనించింది. గ్రాము 22 క్యారెట్ల బంగారం రూ. 90 పెరిగి రూ. 15,040కి చేరింది. తులం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 800 పెరగడంతో ఇది రూ. 1,50,310 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 62 పెరిగి రూ. 12,294 కాగా, తులం ధర రూ. 610 పెరిగి రూ. 1,22,940కి చేరుకుంది.

రూ.2.60 లక్షల మార్కుకు చేరిన కిలో వెండి

బంగారంతో పోటీపడుతూ వెండి ధరలు కూడా భారీగా పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 1 గ్రాము వెండి ధర రూ. 260గా ఉంది. 10 గ్రాముల వెండి కొనుగోలుకు రూ. 2,600 వెచ్చించాల్సి వస్తోంది. అలాగే కిలో వెండి ధర ఏకంగా రూ. 2,60,000 మార్కుకు చేరుకోవడం విశేషం. వెండి ధరల పెంపు కూడా పారిశ్రామిక రంగానికి, సాధారణ కొనుగోలుదారులకు భారంగా మారింది.

పసిడి పరుగుకు ప్రధాన కారణాలు ఇవే

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ క్షీణించడం, బాండ్ ఈల్డ్స్ (బాండ్లపై వచ్చే రాబడి) డిమాండ్ తగ్గడం పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగిన ప్రతిసారీ దేశీయ మార్కెట్లలోనూ ఆ ప్రభావం ప్రత్యక్షంగా పడుతుంది. వీటితో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ధరలను మరింత పైపైకి నెడుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంతో బంగారంపై పెట్టుబడులు పెరగడం ఈ ధరల రికార్డు పరుగుకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లోనూ ఈ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాలు కొనసాగితే పసిడి ధరలు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story