Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : బంగారం కొనేవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.
Gold Price Today
Gold Price Today : కొత్తగా బంగారం నగలు కొనాలనుకునే మహిళలకు, పెట్టుబడిదారులకు మార్కెట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా కూడా ఈ రెండు విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి. గత వారంతో పోలిస్తే తులం బంగారంపై ఏకంగా ఐదు వేల రూపాయలకు పైగానే తగ్గడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కొనుగోళ్లు చేయడానికి ఇది మంచి సమయమని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటు ధరలను పరిశీలిస్తే.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940 వద్ద కొనసాగుతోంది. అలాగే సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,940 వద్ద ట్రేడవుతోంది. ప్రతిరోజూ ఉదయం బులెటిన్ విడుదలయ్యే సమయానికి ఈ ధరలు నమోదవుతాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలను బట్టి రోజులో ఈ ధరలు పెరగవచ్చు లేదా తగ్గుతూ ఉండవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి?
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940గా రికార్డైంది. అలాగే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,31,940 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వ్యాపార నగరం విజయవాడలో కూడా సరిగ్గా ఇవే ధరలు నమోదయ్యాయి. అక్కడ కూడా 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,940, 22 క్యారెట్ల ధర రూ.1,31,940 వద్ద స్థిరంగా సాగుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరల పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పుడూ బంగారం ధరలు కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఈరోజు ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,44,090 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,090 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు నగరాలలో హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్లకు రూ.1,43,940, 22 క్యారెట్లకు రూ.1,31,940 ధరలు ఉన్నాయి. అయితే చెన్నైలో మాత్రం పసిడి ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,45,850 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,33,690 వద్ద ట్రేడవుతోంది.
కిలో వెండి ఎంత?
బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా కేజీ సిల్వర్ సగటు ధర రూ.2,39,000 వద్ద కొనసాగుతోంది. అయితే నగరాలను బట్టి వెండి ధరల్లో కాస్త తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైతో పాటు కేరళ రాష్ట్రంలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద విక్రయించబడుతోంది. కాగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాలలో కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద రన్ అవుతోంది.
నెల రోజుల్లో భారీగా పతనమైన రేట్లు..
గత కొన్ని వారాల డేటాను పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పడిపోయాయి. మే నెల 10వ తేదీన 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ.1,53,140 వరకు పలికింది. కానీ జూన్ చివరి వారానికి వచ్చేసరికి ఇది ఏకంగా రూ.13,267 మేర తగ్గి.. రూ.1,39,873కి పడిపోయింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే మే నెలలో కిలోగ్రాము వెండి రూ.2,62,350 ఉండగా.. అది ఇప్పుడు రూ.45,809 మేర భారీగా క్షీణించి రూ.2,16,541కి చేరింది. ఈ భారీ తగ్గుదల మార్కెట్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.




