Gold Price Today : పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన ధరలు.. తులం బంగారం ఎంతంటే?

Gold Price Today : నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, వెండి ధరల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 5 May 2026 7:43 AM IST
Gold Price Today
X

Gold Price Today 

Gold Price Today : పసిడి ప్రియులకు మండే ఎండల్లో నిజంగానే ఇదో చల్లని కబురు. గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు, మంగళవారం నాడు కాస్త వెనక్కి తగ్గాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఆర్థిక మార్పుల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో, పసిడి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (శుద్ధ బంగారం) ధర నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి రూ.1,49,610 వద్ద కొనసాగుతోంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం తులం ధర కూడా రూ.10 తగ్గి రూ.1,37,140 కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210 గా ఉంది. ధర తగ్గడం చాలా స్వల్పమే అయినప్పటికీ, నిరంతరం పెరుగుతున్న ధరకు బ్రేక్ పడటం విశేషం.

బంగారంతో పాటు వెండి కూడా కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. మంగళవారం కిలో వెండి ధరపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,69,900 గా ఉంది. నిన్న ఇది రూ.2,70,000 వద్ద ఉంది. పారిశ్రామికంగా డిమాండ్ ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ ధరలో మార్పుల వల్ల వెండి ధర కూడా కాస్త నెమ్మదించింది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,49,760 గా ఉండగా.. చెన్నైలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,720 గా నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో వెండి ధర దేశంలోనే తక్కువగా ఉంది, అక్కడ కిలో వెండి రూ.2,64,900 వద్దే లభిస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా, స్థానిక పన్నుల కారణంగా ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

ధరలు తగ్గడానికి కారణాలేంటి?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వస్తున్న వార్తల ప్రభావం పసిడిపై పడుతోంది. ఒక్క ఏడాదిలోనే బంగారం ధర సుమారు రూ.లక్ష పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు కనిపిస్తున్న స్వల్ప తగ్గుదల తాత్కాలికమే కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, కొనుగోలుదారులు ఈ స్వల్ప తగ్గుదల సమయంలోనే ఆభరణాలు కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story