Gold Price Today: బంగారానికి మంచి రోజులు వస్తున్నాయా.? మళ్లీ రూ. 2 లక్షల మార్క్ దాటుందా.?
Gold Price Today: మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధరల్లో ఇటీవల తగ్గుముఖం పట్టాయి. రూ. 2 లక్షలు దాటి దూసుకుపోయిన బంగారం ధర లక్షన్నరకు పడిపోయింది.
Gold Price Today
Gold Price Today: మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధరల్లో ఇటీవల తగ్గుముఖం పట్టాయి. రూ. 2 లక్షలు దాటి దూసుకుపోయిన బంగారం ధర లక్షన్నరకు పడిపోయింది. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.
పెరుగుతోన్న బంగారం ధరలు
బుధవారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 440 పెరిగి రూ. 1,51,370 వద్ద కొనసాగుతోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతోంది.
గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి… పెట్టుబడిదారులు జాగ్రత్త
అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు రోజులుగా పడిపోయిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త స్థిరంగా మారాయి. పెట్టుబడిదారులు పెద్ద నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తత మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అలాగే హోర్ముజ్ జలసంధి పరిస్థితులు కూడా అనిశ్చితంగా ఉన్నాయి.
ఈ మార్గం ప్రపంచానికి ముఖ్యమైన చమురు సరఫరా రూట్ కావడంతో, ఇక్కడ సమస్యలు వస్తే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
అమెరికా–ఇరాన్ చర్చలపై ఆశలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం, ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు తొలగించాలని కోరిందని సమాచారం. దీంతో రెండు దేశాల మధ్య గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్చలు విజయవంతమైతే బంగారం, చమురు మార్కెట్లపై ప్రభావం పడుతుంది.
వడ్డీ రేట్ల నిర్ణయాలపై మార్కెట్ దృష్టి
ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై ఉంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం రేట్లలో మార్పు ఉండకపోవచ్చని అంచనా.
ఇక జపాన్ కేంద్ర బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ జపాన్ తన వడ్డీ రేటును 0.75% వద్ద యథాతథంగా ఉంచింది. అయితే జూన్‌లో పెంపు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
రానున్నో రోజుల్లో ధరలు ఎలా ఉండనున్నాయి.?
ప్రస్తుతం బంగారం ధరలు పరిమిత స్థాయిలోనే మారుతున్నాయి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా బంగారం మీద ఆసక్తి కొనసాగుతోంది. అయితే అమెరికా–ఇరాన్ ఉద్రిక్తత తగ్గినా, లేదా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల్లో మార్పు వచ్చినా, బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది.




