Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు!
Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు!
Gold Rate Today: బులియన్ మార్కెట్లో పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పడింది! గత కొంతకాలంగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ వినియోగదారులకు చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, డిమాండ్‌లో హెచ్చుతగ్గుల కారణంగా బులియన్ ధరకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజా ట్రెండ్ ప్రకారం దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సౌదీ-హౌతీల దాడులు వంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం పసిడి ధర దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గగా, బుధవారం ఉదయానికి కూడా పసిడి, వెండి ధరల్లో స్వల్ప తగ్గింపు నమోదైంది.
నేటి బంగారం, వెండి రేట్లు
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములు) : రూ. 10 తగ్గి ప్రస్తుతం రూ. 1,46,070 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల ఆభరణాల బంగారం (10 గ్రాములు): రూ. 10 తగ్గి రూ. 1,33,890గా ఉంది.
వెండి (కిలో): రూ. 100 మేర తగ్గి రూ. 2,29,900 వద్ద స్థిరపడింది.
స్థానిక పన్నులు, డిమాండ్ , రవాణా వ్యయాల ఆధారంగా వేర్వేరు నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా మారుతుంటాయి. పండుగల సీజన్ , పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో పసిడి కొనుగోలుదారులకు ఈ స్వల్ప ఊరట కాస్త అనుకూలించే అవకాశముంది.




