Gold Price: తులం బంగారం ధర రూ. లక్ష దిగువకు రానుందా.? నిపుణుల అంచనా ఇదే
Gold Price: Gold Price: బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు భారీగా తగ్గుతున్నాయి.
Gold Price: తులం బంగారం ధర రూ. లక్ష దిగువకు రానుందా.? నిపుణుల అంచనా ఇదే
Gold Price: బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు భారీగా తగ్గుతున్నాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో సోమవారం ఒక్కరోజే బంగారం ధర రూ.2,100కు పైగా తగ్గగా.. వెండి ధర కిలోకు రూ.8,400కు పైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం ధర రూ.లక్షకు చేరుతుందా? వెండి ధరలు ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసుకుందాం.
నవంబర్‌లో తొలుత పెరిగిన ధరలు.. ఆ తర్వాత భారీ పతనం
అక్టోబర్ చివరి ట్రేడింగ్ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,485గా ఉండగా.. నవంబర్ 5 నాటికి రూ.1,44,095కు చేరింది. అంటే 4.05 శాతం పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ.1,79,132 నుంచి రూ.1,87,140కు చేరి 4.47 శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే నవంబర్ 5 తర్వాత పరిస్థితి మారిపోయింది. నవంబర్ 16 నాటికి బంగారం ధర రూ.1,34,539కు పడిపోయింది. అంటే రూ.9,556 తగ్గింది. వెండి ధర కూడా రూ.1,87,140 నుంచి రూ.1,67,863కు చేరింది. కిలో వెండిపై ఏకంగా రూ.19,277 తగ్గింది.
బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలివే
ధరల పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కారణమవుతున్నాయి.
ద్రవ్యోల్బణం: భారత్, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
వడ్డీ రేట్లు: డిసెంబర్‌లో ఆర్‌బీఐ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బంగారం, వెండిపై ఒత్తిడి పెంచుతున్నాయి.
డాలర్ బలపడటం: అమెరికా డాలర్ ఇండెక్స్ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి.
భవిష్యత్తులో ధరలను ప్రభావితం చేసే అంశాలు
రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు ఐదు కీలక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్ విలువ, ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్ వీటిలో ముఖ్యమైనవి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాల్లో డిమాండ్ తగ్గితే వెండి ధరలపై మరింత ఒత్తిడి పడవచ్చు.
బంగారం ధర రూ.లక్షకు చేరుతుందా?
బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్షకు చేరాలంటే ప్రస్తుత స్థాయి నుంచి మరో 26 శాతం వరకు తగ్గాల్సి ఉంటుంది. అయితే ఏడాది ముగియడానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో ఇంత భారీ పతనం సాధ్యపడకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయతే బంగారం ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల మధ్యకి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. వెండి ధర కిలోకు రూ.1.40 లక్షల నుంచి రూ.1.60 లక్షల పరిధిలో కొనసాగవచ్చు. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే బంగారం రూ.లక్ష స్థాయికి, వెండి రూ.1.35 లక్షల సమీపానికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.




