Gold Price Today : గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు కాస్త ఊరటనిస్తున్నాయి.
Gold Price Today
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు.. తాజాగా రెండు రోజుల తరువాత మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు కాస్త ఊరటనిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో, నిన్నటితో పోలిస్తే ఎంత మార్పు వచ్చిందో వివరంగా తెలుసుకుందాం. బంగారం ప్రేమికులకు ఇదొక శుభవార్త అని చెప్పాలి. నిన్నటితో పోల్చి చూస్తే ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.320 వరకు తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ.1,39,950 వద్దకు చేరుకుంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం వెండి కిలో ధరలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ పెరగడం కూడా ఈ ధరల మార్పులకు ఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,670 గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.2,74,900 లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గుదల మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరటనిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,870 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా దాదాపు హైదరాబాద్ తరహాలోనే ధరలు ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,39,940 గా నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,41,030 వద్ద కొనసాగుతోంది.
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. డాలర్ బలోపేతం కావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిణామాలు బంగారం ధరల మీద ప్రభావం చూపుతున్నాయి. అయితే బంగారం ధరలు ఒక రోజు పెరగడం, మరుసటి రోజు తగ్గడం అనేది సామాన్యులను అయోమయానికి గురిచేస్తున్నా, ప్రస్తుతానికి ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశమే. నిన్నటి కంటే ఈరోజు రేట్లు తగ్గడం వల్ల జ్యువెలరీ షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగే అవకాశం ఉంది.




