Gold Rate Today : పసిడి ప్రియులకు ఊరట.. పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే

Gold Rate Today : శ్రావణ మాసం వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు తీపి కబురు అందింది. గత మూడ్రోజులుగా పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

CR Reddy
Published on: 15 Aug 2026 7:57 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today : శ్రావణ మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, పూజల సందడి మొదలైంది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ వారాంతంలో ఊరట లభించింది. వారం ప్రారంభంలో భయపెట్టిన పసిడి ధరలు గడచిన మూడు రోజులుగా వరుసగా దిగివస్తున్నాయి. ఉన్నట్టుండి ధరలు పడిపోతుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండే సమయంలో ఈ తగ్గుదల రావడం నిజంగా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం ఎంతవరకు?

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు పసిడి మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా సమసిపోలేదు. దానికితోడు రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ పోరు తీవ్రతరం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ధరలు తగ్గుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా యుద్ద వాతావరణం నెలకొనడం వల్ల రాబోయే రోజుల్లో బంగారం ధర ఏ వైపు పయనిస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు

ప్రధాన నగరాల్లో శనివారం నమోదైన పసిడి ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,52,880 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,140 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కూడా 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,52,880 గానూ, 22 క్యారెట్ల రేటు రూ.1,40,140 గా నమోదైంది. చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,390 వద్ద విక్రయమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,53,030 వద్ద లభిస్తుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,290 వద్ద స్థిరపడింది.

వెండి బాటలోనే స్వల్ప ఊరట

బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. శుక్రవారం నాటి ధరలతో పోలిస్తే శనివారం కిలో వెండిపై కొద్దిపాటి తగ్గింపు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వరకు అన్ని ప్రధాన ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం లభించిన రూ.2.55 లక్షల రేటుతో పోలిస్తే కొద్దిగా తగ్గడం వెండి ప్రేమికులకు ఊరటనిచ్చే అంశం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story