Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
Gold Price Today: గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాబోయే రోజుల్లో పసిడి ధరలను నిర్దేశించనున్నాయి.
Gold Price Today
Gold Price Today: గత కొద్ది రోజులుగా పసిడి కొనాలనుకునే వారికి అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. ఆకాశాన్నంటిన పసిడి పరుగులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోలు దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అమెరికా ఆర్థిక పరిణామాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపడంతో పసిడి, వెండి ధరల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా పసిడి బాట మారడానికి ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ సంకేతాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ తగ్గడం, అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన అంచనాలు మందగించడం మార్కెట్లను కుదుపేసింది. దీనికితోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ అంచనాలు పసిడి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. శనివారం స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, ఆదివారం నాటికి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుని మళ్లీ కిందికి దిగొచ్చాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశీయంగా చూస్తే సెప్టెంబర్ 6వ తేదీన ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.1,54,800 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. మన తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో కూడా 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.1,54,800 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,900గా నమోదైంది.
మిగిలిన మెట్రో నగరాల రేట్లు
దక్షిణాది కీలక నగరం బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.1,54,800 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,900 వద్ద విక్రయాలు సాగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం పసిడి ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,56,670 కాగా, 22 క్యారెట్ల తులానికి రూ.1,43,610 మార్కును తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.1,54,950 వద్ద కొనసాగుతుంటే, 22 క్యారెట్ల ధర రూ.1,42,050 వద్ద స్థిరపడింది.
వెండి ధరల పరిస్థితి ఇదీ
పసిడి బాటలోనే వెండి కూడా కొనుగోలుదారులకు అనుకూలంగానే కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద విక్రయమవుతోంది. హైదరాబాద్, చెన్నై మార్కెట్లను పరిశీలిస్తే ఇక్కడ కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.




