Gold Price Today : రాకెట్‌లా పరిగెడుతున్న పసిడి.. నేడు మళ్లీ జంప్, వెండి ధరలు మాత్రం స్థిరం

Gold Price Today : ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,340 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,310 గా నమోదైంది.

CR Reddy
Published on: 31 July 2026 7:39 AM IST
Gold Price Today
X

Gold Price Today 

Gold Price Today : భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలు ఏదైనా సరే పసిడి కొనుగోలు చేయడం మన ఆనవాయితీ. అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు చుక్కలు చూపిస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. నిన్నటివరకు కొంత ఊరటనిచ్చిన పసిడి ధరలు ఈరోజు ఉదయాన్నే మళ్లీ స్వల్పంగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.

ధరలు పెరగడానికి కారణాలు ఏంటి?

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరిగి, ఆ ప్రభావం మన దేశీయ మార్కెట్‌పై కూడా పడుతోంది. ఈ ఏడాది నమోదు చేసిన రికార్డు గరిష్ట స్థాయిలతో పోలిస్తే రేట్లు కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నరకు అటుఇటూగా ఊగిసలాడుతోంది.

హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బంగారం, వెండి ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340 గా నమోదైంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,310 వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద విక్రయించబడుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు:

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,44,490 కాగా, 22 క్యారెట్లకు రూ.1,32,460 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,34,900గా పలుకుతోంది. ముంబై, బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,44,340 కాగా, 22 క్యారెట్లు రూ.1,32,310 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,340, 22 క్యారెట్లు రూ.1,32,310. కిలో వెండి ధర రూ.2,34,900గా పలుకుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,340, 22 క్యారెట్లు రూ.1,32,310 గా ఉండగా.. కిలో వెండి ధర రూ.2,35,100 వద్ద నమోదైంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story