Gold Price Today : అబ్బా సాయిరాం..! ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. కొనేవాళ్లకు పండగే

Gold Price Today : గత కొన్ని రోజులుగా సరికొత్త రికార్డు స్థాయిలను తాకుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, తాజాగా భారీగా దిగివచ్చాయి.

CR Reddy
Published on: 31 May 2026 7:03 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా సరికొత్త రికార్డు స్థాయిలను తాకుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, తాజాగా భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, ఇరాన్ అలాగే అమెరికా దేశాల మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఒడిదుడుకుల మధ్యే గత ఐదు రోజులుగా పసిడి రేట్లు భారీగా పతనం కావడం విశేషం.

గత ఐదు రోజుల మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే.. బంగారం కొనేవారికి భారీ లాభం చేకూరిందని చెప్పవచ్చు. కేవలం ఐదు రోజుల్లోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3,040 మేర భారీగా తగ్గింది. శనివారం ఒక్కరోజే పసిడిపై రూ.600 వరకు ధర తగ్గడం గమనార్హం. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలోపై ఏకంగా రూ.4,500 వరకు దిగివచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, మున్ముందు రోజుల్లో కూడా ఈ ధరలు మరింత తగ్గే అవకాశం బలంగా ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆదివారం (మే 31, 2026) ఉదయం వరకు అందిన తాజా సమాచారం ప్రకారం.. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సగటు ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,57,040 గా నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,950 వద్ద కొనసాగుతోంది. మరోవైపు పసిడి దారిలో తగ్గిన వెండి ధర, ఇవాళ కిలోపై రూ.100 మేర స్వల్పంగా పెరిగి రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల విషయానికి వస్తే ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,040గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950గా ఉంది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,90,000 వద్ద విక్రయించబడుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు వర్తిస్తున్నాయి. అక్కడ కూడా 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,57,040 గా, 22 క్యారెట్ల ధర రూ.1,43,950 గా స్థిరంగా ఉంది. అలాగే వెండి కిలో ధర రూ.2,90,000 వద్దే కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో పసిడి ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,57,190 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,100 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు సిలికాన్ సిటీ బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,57,040 గా, 22 క్యారెట్ల ధర రూ.1,43,950 గా నమోదైంది. ఈ మూడు నగరాల్లోనూ వెండి కిలో ధర రూ.2,80,000 లుగా ఉంది. ఇకపోతే చెన్నై నగరంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,59,600 వద్ద కొంచెం ఎక్కువగా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,630 వద్ద, వెండి కిలో ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story