Gold Price Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు
Gold Price Today: ఏప్రిల్ 23న హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
Gold Price Today
Gold Price Today: దేశంలో బంగారం ధరలు నేడు (ఏప్రిల్ 23, 2026) నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉండటంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సమయంలో ధరల్లో పెరుగుదల లేకపోవడం వినియోగదారులకు కలిసొచ్చే అంశం. ప్రధాన నగరాల్లో పసిడితో పాటు వెండి ధరలు కూడా మార్పు లేకుండానే కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు నిలకడగా ట్రేడ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,54,750 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,42,000, 24 క్యారెట్ల ధర రూ. 1,54,900 గా నమోదైంది. ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే 22 క్యారెట్లకు రూ. 1,41,850, 24 క్యారెట్లకు రూ. 1,54,750 చొప్పున ధరలు ఉన్నాయి. చెన్నైలో మాత్రం పసిడి ధర స్వల్పంగా ఎక్కువగానే ఉండి, 22 క్యారెట్లకు రూ. 1,42,500, 24 క్యారెట్లకు రూ. 1,55,460 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే, గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నై, కేరళలో కూడా ఇవే ధరలు కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి సుమారు రూ. 2,65,000 పలుకుతోంది. పైన పేర్కొన్న ధరలు మార్కెట్ సగటు ధరలు మాత్రమేనని, వీటిపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని వినియోగదారులు గమనించాలి.
బంగారం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం హాల్‌మార్క్ లేని ఆభరణాల విక్రయాలను ఖచ్చితంగా నిషేధించింది. కాబట్టి మీరు కొనే ప్రతి నగపై HUID నంబర్ ఉందో లేదో సరిచూసుకోవాలి. మీ దగ్గర ఉన్న నగ స్వచ్ఛతను మీరే సొంతంగా పరీక్షించుకోవచ్చు. దీనికోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో BIS Care అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, అందులోని Verify HUID ఆప్షన్ ద్వారా నగపై ఉన్న నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీనివల్ల ఆ నగను ఏ షాపులో హాల్‌మార్క్ చేయించారు. దాని అసలైన స్వచ్ఛత ఎంత వంటి పూర్తి వివరాలు మీ మొబైల్ తెరపైనే కనిపిస్తాయి.




