Gold Rate Today: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతంటే..?

Gold Rate Today: దేశంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gagan kumar
Published on: 7 Oct 2026 10:31 AM IST
Gold Rate Today
X

Gold Rate Today: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతంటే..?

Gold price in India: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే. గతకొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో ఊరట చెందిన జనానికి, ఇప్పుడు మళ్లీ ధరల పెరుగుదల రూపంలో బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావంతో పసిడి మార్కెట్‌లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.

హైదరాబాద్‌‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,230 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,37,710 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధానిలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,50,380 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,3,7,560గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,50,230 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,37,710 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,010 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,37,710 వద్ద ఉంది.

బంగారంతో పోలిస్తే వెండి ప్రియులకు మాత్రం కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

హైదరాబాద్ & చెన్నై: కేజీ వెండి ధర రూ. 2,44,900 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీ & బెంగళూరు: కేజీ సిల్వర్ ధర రూ. 2,34,900 వద్ద కొనసాగుతోంది.

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. గ్లోబల్ పరిణామాలు, కరెన్సీ విలువలో మార్పుల కారణంగా రాబోయే రోజుల్లోనూ పసిడి ధరల్లో ఇదే రకమైన హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆభరణాలు లేదా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్ గమనించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.