Today Gold Price: పసిడి ప్రియులకు షాక్..తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold Price: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.

Naresh.k
Published on: 11 July 2026 7:59 AM IST
Today Gold Price
X

Today Gold Price: పసిడి ప్రియులకు షాక్..తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?

Gold Rate: బంగారం కొందామనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. ప్రతిరోజూ దోబూచులాడుతున్న పసిడి ధరలు.. ఒకరోజు తగ్గితే, మరోరోజు అంతకంతకూ పెరుగుతూ కొనుగోలుదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా జూలై 11వ తేదీన దేశంలో తులం బంగారం ధరపై ఏకంగా రూ. 400 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ బలపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తల నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు రెక్కలు విప్పాయి. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో ఈరోజు సరికొత్త రికార్డు స్థాయి ధరల వద్ద పసిడి ట్రేడవుతోంది.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో పసిడి ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 1,44,830 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,32,760 వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా భారీ ధరల వద్దే కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి.

హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 2,44,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,40,100 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4,100 డాలర్ల దిగువకు చేరినప్పటికీ, దేశీయంగా ఉన్న డిమాండ్, ఇతర ఆర్థిక పరిణామాల వల్ల ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురికావడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు చోటు చేసుకున్నప్పుడు లేదా ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తుంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. అందుకే స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు జనం బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు, ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు కూడా ఇలా ఊహించని స్థాయికి చేరుకుంటాయి.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పసిడి ధరలు సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారం కొనాలనుకునే వారు ఈ ధరల ట్రెండ్‌ను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story