Gold Rate Today : పసిడి ప్రియులకు ఊరట.. మళ్ళీ దిగివచ్చిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే?

Gold Rate Today : కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా దిగివచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ చిన్నపాటి తగ్గుదల కూడా కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

CR Reddy
Published on: 30 April 2026 7:32 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today : బంగారం అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, భారతీయులకు అదొక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు. అందుకే ధరలు ఎంత పెరిగినా పసిడిపై మమకారం అస్సలు తగ్గదు. అయితే గత కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా దిగివచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ చిన్నపాటి తగ్గుదల కూడా కొనుగోలుదారులకు, ముఖ్యంగా మహిళలకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

ఏప్రిల్ 30, 2026 గురువారం రోజున మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధరల్లో రూ.10 వరకు తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్ల వివరాల ప్రకారం.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.1,50,430 గా ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ.1,50,440 ఉండగా, నేడు స్వల్పంగా తగ్గింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,37,900 ఉండగా, నేడు రూ.10 తగ్గి రూ.1,37,890 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,12,830 ఉండగా, నేడు రూ.1,12,820 గా నమోదైంది.

ఎందుకు ఈ హెచ్చుతగ్గులు?

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం, ఇన్వెస్టర్లు బంగారం వైపు నుంచి ఇతర పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాల వల్ల ధరల్లో ఈ మార్పులు వస్తుంటాయి. అయితే ఇండియాలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అక్షయ తృతీయ వంటి పండుగలు కూడా దగ్గర పడుతుండటంతో డిమాండ్ భారీగా ఉంది. ధరలు కొంచెం తగ్గినా సరే, అది మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చు. ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయడం లేదా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మహిళల మక్కువ.. మార్కెట్ హడావుడి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం వ్యాపారం ఎప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగానే ఉంటుంది. ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా పసిడి కొనుగోలుకు మనవాళ్లు ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు ధర రూ.10 మాత్రమే తగ్గినప్పటికీ, పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండటం కూడా సానుకూల అంశమే. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి ప్రధాన మార్కెట్లతో పాటు విజయవాడలోని నగల దుకాణాల్లో నేడు కొనుగోలుదారుల రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయి?

బంగారంతో పాటు వెండి ధరలు కూడా ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. సాధారణంగా బంగారం ధర తగ్గినప్పుడు వెండిలో కూడా మార్పులు కనిపిస్తుంటాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,65,000గా ఉంది.అయితే చిన్నపాటి హెచ్చుతగ్గులు సాధారణమే. మీరు గనుక ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మేకింగ్ ఛార్జీలు కూడా పరిగణనలోకి తీసుకుని మంచి షాపులో బేరం కుదుర్చుకోవడం ఉత్తమం

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story