Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న MCXలో 10 గ్రాముల పసిడి రూ.1,400 కాగా, వెండి రూ.4,000 పెరిగింది.

CR Reddy
Updated on: 10 Nov 2026 7:25 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today: గత కొన్ని రోజులుగా వరుస తగ్గుగుముఖం పడుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పైకి లేచాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మార్కెట్‌లో నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,400 పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.4,000 వరకు పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అమెరికన్ డాలర్ విలువ బలహీనపడటం వంటి పరిణామాలు పసిడి రంగానికి ఊతాన్ని అందించాయి. నవంబర్ 10వ తేదీ ఉదయానికి నమోదు చేసిన తాజా వివరాలు చూద్దాం.

హైదరాబాద్, విజయవాడలో పసిడి ధరలు

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన భాగ్యనగరం అలాగే విజయవాడల్లో పసిడి ధరలు నిన్నటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 వద్ద ట్రేడవుతోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,560 వద్ద నిలిచింది. పండుగ రోజుల్లో బంగారం కొనుగోలు చేయడానికి నిశ్చయించుకున్న కస్టమర్లకు ఈ సడన్ పెంపు కొంత మింగుడు పడని అంశంగా మారింది.


నగరం 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) వెండి (1 కిలోగ్రాము)
హైదరాబాద్ రూ.1,32,560 రూ.1,44,610 రూ.2,04,900
విజయవాడ రూ.1,32,560 రూ.1,44,610 రూ.2,04,900
విశాఖపట్నం

రూ.1,32,560

రూ.1,44,610

రూ.2,04,900
అమరావతి

రూ.1,32,560

రూ.1,44,610

రూ.2,04,900
తిరుపతి

రూ.1,32,560

రూ.1,44,610

రూ.2,04,900
వరంగల్

రూ.1,32,560

రూ.1,44,610

రూ.2,04,900
ఢిల్లీ రూ.1,32,710 రూ.1,44,760 రూ.2,04,900
ముంబై రూ.1,32,560 రూ.1,44,610 రూ.2,04,900
చెన్నై రూ.1,31,580 రూ.1,43,550 రూ.2,04,900
కోల్‌కతా

రూ.1,31,580

రూ.1,43,550

రూ.2,04,900
బెంగళూరు రూ.1,32,560 రూ.1,44,610 రూ.2,04,900

ప్రధాన నగరాలలోని పసిడి మార్కెట్ ధరలు

దేశంలోని ఇతర ముఖ్య పట్టణాలలో కూడా ఇదే తీరు కనిపించింది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,44,610 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,560గా రికార్డయింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,44,760 వద్ద లభిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,43,550 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,580 వద్ద ముగిసింది. వెండి ధర మాత్రం దేశవ్యాప్తంగా కిలో రూ.2,04,900 వద్ద నిలకడగా ఉంది.

ముడి చమురు తగ్గుదల పసిడిపై ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం పసిడికి అనుకూలంగా మారింది. చమురు ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం మార్కెట్లలో వ్యక్తమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వదు కాబట్టి, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచితే పెట్టుబడిదారులు పసిడి వైపు పెద్దగా మొగ్గు చూపరు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ దిగిరావడంతో వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గి ఇన్వెస్టర్లు మళ్లీ పసిడి బాట పట్టారు.

డాలర్ బలహీనత.. బంగారంపై మున్ముందు ప్రభావం

అమెరికన్ డాలర్ విలువ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది. విదేశీ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్ పుంజుకుంటోంది. రోజువారీ ట్రేడింగ్ సరళి ఆధారంగా ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య వర్తక వివరాలు సవరణ అవుతాయి. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ కదలికలను బట్టి పసిడి మళ్లీ కొత్త రికార్డులను సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.