Google: గూగుల్ నుంచి మీకు ఈ-మెయిల్ వచ్చిందా.. అసలు కారణం ఇదే.!

Google: గూగుల్ తమ యూజర్లకు ఐటీ రూల్స్ గుర్తు చేస్తూ మెయిల్స్ పంపిస్తున్నట్లు వస్తున్న తాజా సమాచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.

Ravi
By Ravi
Published on: 4 Oct 2026 10:34 AM IST
Google
X

Google: గూగుల్ నుంచి మీకు ఈ-మెయిల్ వచ్చిందా.. అసలు కారణం ఇదే.!

Google: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగించే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తన యూజర్ల భద్రత అలాగే నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. డిజిటల్ వేదికలపై పెరుగుతున్న తప్పుడు కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది.

ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ తన వినియోగదారులందరికీ ఐటీ నిబంధనలను గుర్తు చేస్తూ అధికారికంగా మెయిల్స్ పంపిస్తోంది. నిన్న రాత్రి నుంచి వినియోగదారులకు అందుతున్న ఈ మెయిల్స్ ప్రస్తుతం టెక్ వర్గాలలో అలాగే సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అందుతున్న సమాచారం ప్రకారం గూగుల్ పంపిస్తున్న ఈ మెయిల్స్‌లో డిజిటల్ సేఫ్టీకి సంబంధించిన పలు కీలక అంశాలను స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇల్లీగల్ లేదా ఫేక్ ఫోటోలు, వీడియోలు అలాగే ఇతర తప్పుడు కంటెంట్‌ను క్రియేట్ చేయడం పూర్తిగా నిషేధించబడినట్లు గూగుల్ పేర్కొంది. ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘించి అలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

నిబంధనలు బ్రేక్ చేసే వారికి తొలుత హెచ్చరిక లేదా వార్నింగ్ మెసేజ్ వస్తుందని, ఆ తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే అకౌంట్ బ్లాక్ చేయబడుతుందని స్పష్టం చేసింది.

అలాగే ఖాతాను పూర్తిగా తొలగించడంతో పాటు అవసరమైతే ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని గూగుల్ తన మెయిల్‌లో హెచ్చరించింది. వినియోగదారులు ఎల్లప్పుడూ గూగుల్ సర్వీస్ నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని కోరింది.

కాగా, ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన 'చుట్టమల్లె' వివాదం వేళ గూగుల్ నుంచి ఈ మెయిల్స్ రావడాన్ని కొంతమంది నెటిజన్లు ఆ సంఘటనకు లింక్ చేస్తూ చర్చిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టేలా టెక్ కంపెనీలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మెయిల్స్‌కు సంబంధించిన చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో చాలా మంది వినియోగదారులు తమ మేల్‌ను చెక్ చేసుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై తప్పుడు చిత్రాలు అలాగే అసభ్యకరమైన వీడియోల సృష్టిని నివారించడానికి ఈ నిబంధనలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ భద్రతను మరింత కఠినతరం చేయడానికి గూగుల్ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. వినియోగదారులు అందరూ ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.