HDFC Bank: అరె.! ఏంట్రా ఇది.. 46 పైసలు కట్టలేదని ఏకంగా రూ. 1200 ఫైన్..
HDFC Bank: క్రెడిట్ కార్డు బిల్లులో బకాయి ఉంటే ఫైన్ వేయడం కామన్. అయితే ఒక కస్టమర్‌కు వచ్చిన బిల్లులో 46 పైసలు తక్కువగా చెల్లించాడనే కారణంతో HDFC బ్యాంక్ ఏకంగా రూ.1200 లేట్ ఫీజు విధించింది.
HDFC Bank: అరె.! ఏంట్రా ఇది.. 46 పైసలు కట్టలేదని ఏకంగా రూ. 1200 ఫైన్..
HDFC Bank: క్రెడిట్ కార్డు బిల్లులో బకాయి ఉంటే ఫైన్ వేయడం కామన్. అయితే ఒక కస్టమర్‌కు వచ్చిన బిల్లులో 46 పైసలు తక్కువగా చెల్లించాడనే కారణంతో HDFC బ్యాంక్ ఏకంగా రూ.1200 లేట్ ఫీజు విధించింది.
క్రెడిట్ కార్డు బిల్లుల నిర్వహణ విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న నిబంధనలు కొన్నిసార్లు వినియోగదారులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంటాయి. క్రెడిట్ కార్డు బిల్లులో కొద్దిగా బకాయి ఉంటే సాధారణంగా బ్యాంకులు జరిమానా విధించడం పరిపాటి. అయితే ఒక కస్టమర్‌కు వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లులో రూ. 16,649.46 బిల్లుకు బదులుగా పొరపాటున రూ. 16,649 మాత్రమే చెల్లించడం జరిగింది.
కేవలం నలభై ఆరు పైసలు తక్కువగా చెల్లించారనే చిన్న కారణంతో HDFC బ్యాంక్ ఏకంగా రూ.1200 లేట్ ఫీజు రూపంలో జరిమానా విధించింది. డాక్టర్ సమీర్ అనే కస్టమర్ తన బిల్లు చెల్లించే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. కేవలం నలభై ఆరు పైసల బకాయి కోసం ఇంత భారీ మొత్తంలో ఫైన్ వేస్తారా అని ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్ సిబ్బంది కూడా ఈ విషయంలో సరిగా స్పందించలేదని, తమ సమస్యను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి బ్యాంక్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చిన్న పొరపాట్లకు కూడా భారీగా జరిమానాలు విధించడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన HDFC బ్యాంక్ కస్టమర్ సమస్యను పరిశీలిస్తామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని రిప్లై ఇచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల పట్ల మరింత సరళమైన విధానాలను అవలంబించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.




