HDFC: గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ..లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు!
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
HDFC: గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ..లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు!
HDFC Bank Cut MCLR Rates: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ రుణ గ్రహీతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను ఎంపిక చేసిన టెన్యూర్లపై తగ్గించినట్లు వెల్లడించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 7, 2026 నుంచే అమలులోకి వచ్చాయి. ఈ తగ్గింపు ద్వారా ఫ్లోటింగ్ రేట్‌పై రుణాలు తీసుకున్న వారి ఈఎంఐ భారం స్వల్పంగా తగ్గనుంది.
బ్యాంక్ వివిధ టెన్యూర్ల పై 5 బేసిస్ పాయింట్ల (0.05%) వరకు వడ్డీ రేట్లను తగ్గించింది. సవరణ తర్వాత కొత్త రేట్లు 8.00% నుంచి 8.65% మధ్య ఉన్నాయి. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్: 8.05% నుంచి 8.00% కి తగ్గింది.1 నెల ఎంసీఎల్ఆర్: 8.05% నుంచి 8.00% కి తగ్గింది.3 నెలల ఎంసీఎల్ఆర్: 8.20% నుంచి 8.15% కి తగ్గింది. 6 నెలల ఎంసీఎల్ఆర్: 8.35% నుంచి 8.30% కి తగ్గింది.1 సంవత్సరం ఎంసీఎల్ఆర్ (బెంచ్‌మార్క్): 8.45% నుంచి 8.40% కి తగ్గింది. 2 సంవత్సరాల ఎంసీఎల్ఆర్: మార్పు లేకుండా 8.55% వద్దే కొనసాగుతోంది. 3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్: 8.70% నుంచి 8.65% కి తగ్గింది.
ఎవరికి ప్రయోజనం?
ఎంసీఎల్ఆర్ ఆధారిత హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ పొందిన వారికి వారి తదుపరి రిసెట్ తేదీ నుంచి తగ్గిన ఈఎంఐ వర్తిస్తుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి సవరించిన తక్కువ వడ్డీ రేట్లే నేరుగా వర్తిస్తాయి. మరోవైపు, బ్యాంక్ తన బేస్ రేటును 8.70%గా, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 17.20%గా సవరించింది. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 2.75% నుంచి 6.50% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7.00% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.




