Home Loan: హోమ్ లోన్ ఉన్న వారికి బ్యాడ్ న్యూస్‌.. ఈ బ్యాంక్ వాళ్ల‌కి పెరిగిన ఈఎమ్ఐ

Home Loan: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ రుణాలపై వడ్డీ రేట్లలో కీలక మార్పులు చేసింది.

Mokshith
Published on: 8 May 2026 2:45 PM IST
Home Loan
X

 Home Loan

Home Loan: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ రుణాలపై వడ్డీ రేట్లలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ఇది పెద్ద షాక్‌గా మారింది. బ్యాంక్ మూడు సంవత్సరాల MCLRను పెంచడంతో ఇకపై EMIలు మరింత పెర‌గ‌నున్నాయి.

హోమ్ లోన్ తీసుకున్న వారికి పెరిగిన EMI భారం

HDFC బ్యాంక్ మూడు సంవత్సరాల కాలపరిమితి ఉన్న MCLR (మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌)ను 0.05 శాతం పెంచింది. దీంతో ఈ రేటు 8.55% నుంచి 8.60%కి చేరింది. సాధారణంగా చాలా హోమ్ లోన్లు దీర్ఘకాల MCLR ఆధారంగా ఉంటాయి. అందువల్ల ఈ మార్పు నేరుగా హోమ్ లోన్ EMIలపై ప్రభావం చూపుతుంది.

ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం, కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత ఆర్థిక భారం కానుంది. EMIలు పెరగడం వల్ల నెలవారీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

చిన్న వ్యాపారులకు మాత్రం ఊరట

దీర్ఘకాల రుణాలపై వడ్డీ పెంచిన బ్యాంక్, స్వల్పకాల రుణాలపై మాత్రం వడ్డీ తగ్గించింది. ఆరు నెలల వరకు ఉన్న MCLR రేట్లలో 0.05 శాతం కోత విధించింది. దీంతో చిన్న వ్యాపారులు, కంపెనీలు తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ లోన్లు కొంత చౌకగా మారనున్నాయి. ముఖ్యంగా బిజినెస్ విస్తరణ కోసం తక్కువ కాలానికి రుణాలు తీసుకునేవారికి ఇది ప్రయోజనం కలిగించనుంది.

కొత్త రేట్లు ఇలా ఉన్నాయి

ఒక నెల MCLR: 8.10% నుంచి 8.05%, మూడు నెలల MCLR: 8.15%, ఆరు నెలల MCLR: 8.30%గా నిర్ణ‌యించారు. ఈ నిర్ణయం చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాల రేట్లలో మార్పుల్లేవు. HDFC బ్యాంక్ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల MCLR రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఒక సంవత్సరం MCLR: 8.35%, రెండు సంవత్సరాల MCLR: 8.45%గా ఉంది. తాజా మార్పుల తర్వాత బ్యాంక్ మొత్తం MCLR పరిధి 8.05% నుంచి 8.60% మధ్యకు చేరింది.

MCLR అంటే ఏమిటి?

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) సులభంగా చెప్పాలంటే, బ్యాంక్ ఒక కస్టమర్‌కు ఇవ్వగల కనీస రుణ వడ్డీ రేటు ఇదే. దీనికంటే తక్కువ వడ్డీకి సాధారణంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకులు మార్కెట్ నుంచి డబ్బు సేకరించే ఖర్చు, నిర్వహణ వ్యయం, ఇతర ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేట్లను నిర్ణయిస్తాయి. MCLR మారితే హోమ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్ వంటి రుణాల EMIలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే బ్యాంకుల MCLR మార్పులను రుణగ్రహీతలు గమనించడం చాలా ముఖ్యంగా భావిస్తున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story