HDFC: రూ. 10 వేల SIP ని రూ. 1.91 కోట్లు చేసిన మ్యాజిక్..!

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 19 ఏళ్లలో 19.28% వార్షిక రాబడితో నెలకు రూ. 10,000 SIP ని రూ. 1.91 కోట్లుగా మార్చింది.

Gagan kumar
Published on: 21 Aug 2026 10:50 AM IST
HDFC
X

HDFC: రూ. 10 వేల SIP ని రూ. 1.91 కోట్లు చేసిన మ్యాజిక్..!

HDFC: స్టాక్ మార్కెట్ లవర్స్ , మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు మిడ్ క్యాప్ కేటగిరీ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణే. లార్జ్ క్యాప్ ఫండ్ల లాంటి స్థిరత్వం, స్మాల్ క్యాప్ ఫండ్ల లాంటి విపరీతమైన రాబడి సామర్థ్యం... ఈ రెండింటి కలయికే మిడ్ క్యాప్. ఈ విభాగంలో ఎన్నో ఫండ్లు ఉన్నప్పటికీ, నిర్వహణలోని ఆస్తుల పరంగా, నిలకడైన రాబడి పరంగా హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ ఒక సంచలనంగా మారింది.

గత ఐదేళ్ల కాలంలో ఈ ఫండ్ చూపించిన పనితీరు పెట్టుబడిదారులను అశ్చర్యపరిచింది. సగటున వార్షిక ప్రాతిపదికన ఏకంగా 20.04% రిటర్న్స్ అందించి కాసుల వర్షం కురిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ రాబడి 20.04%, బెంచ్‌మార్క్ ఇండెక్స్ రాబడి 18.26%, మిడ్ క్యాప్ కేటగిరీ సగటు రాబడి 16.12%, కాంబినేషన్ ఏదైనా, మార్కెట్ బెంచ్‌మార్క్ కంటే, కేటగిరీ సగటు కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి తన ప్రతిభను చాటుకుంది.

దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో నిరూపించడానికి ఈ ఫండ్ ఒక ఉత్తమ ఉదాహరణ. 2007 జూన్‌లో ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టిన వారి జీవితాలే మారిపోయాయి. ఫండ్ ప్రారంభమైన నాటి నుంచి నెలకు రూ. 10,000 చొప్పున SIP చేసుకుంటూ వచ్చిన వారి మొత్తం పెట్టుబడి ఈ 19 ఏళ్ల కాలంలో రూ. 1.91 కోట్లుగా రూపాంతరం చెందింది! ఇక్కడ లభించిన సగటు వార్షిక రాబడి 19.28%.

ప్రారంభంలోనే ఒకేసారి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారి కార్పస్ ఈనాటికి ఏకంగా రూ. 21.27 లక్షలు దాటింది. స్వల్ప కాల పరిమితిలో SIP రాబడులను ఓసారి గమనిస్తే.. 10 ఏళ్లలో రూ. 33.26 లక్షలు, 5 ఏళ్లలో రూ. 9.61 లక్షలు ,3 ఏళ్లలో రూ. 4.90 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ గణాంకాలే చెప్తున్నాయి. స్వల్ప కాలంలో కాకుండా దీర్ఘకాలంలోనే మ్యూచువల్ ఫండ్ల ద్వారా అసలైన సంపద సృష్టి సాధ్యమవుతుందని!

ఈ ఫండ్ సాధించిన విజయాలకు గుర్తుగా, 2026 జులై నాటికి దీని నిర్వహణలోని ఆస్తుల విలువ ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లు దాటింది. భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన మిడ్ క్యాప్ ఫండ్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇలా వైవిధ్యమైన విభజన పాటించడం వల్లే మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని నిలబడగలిగింది. గతంలో వచ్చిన అద్భుతమైన రాబడులు భవిష్యత్తులోనూ ఖచ్చితంగా వస్తాయని గ్యారెంటీ ఇవ్వలేం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఎప్పుడూ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story