HDFC : మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త
HDFC : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను జూలై 1, 2026 నుంచి మారుస్తోంది.
HDFC : మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త
HDFC credit card : దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులను ప్రకటించింది. ఇప్పటివరకు ఆస్వాదించిన ఉచిత బెనిఫిట్స్‌లో కోత విధిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పాపులర్ కార్డు అయిన రెగాలియా గోల్డ్ వినియోగదారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇకపై ఎయిర్‌పోర్టులో ఉచితంగా రిలాక్స్ అవుదామనుకునే వారికి నిబంధనలు కఠినమయ్యాయి. రెగాలియా గోల్డ్ కార్డుపై ఉచిత లాంజ్ సౌకర్యం పొందాలంటే బ్యాంక్ పెట్టిన టార్గెట్‌ను రీచ్ అవ్వాల్సి ఉంటుంది.
ఒక త్రైమాసికంలో కనీసం రూ. 60,000 ఖర్చు చేస్తేనే, తర్వాతి త్రైమాసికంలో ఉచిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. మీరు జూలై-సెప్టెంబర్ 2026 మధ్య లాంజ్ యాక్సెస్ పొందాలనుకుంటే, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మీ కార్డు ద్వారా రూ. 60,000 ఖర్చు చేసి ఉండాలి. ఇప్పటివరకు ఉన్న వోచర్ ఆధారిత లాంజ్ యాక్సెస్ విధానాన్ని బ్యాంక్ రద్దు చేసింది. ఇకపై నేరుగా కార్డును స్వైప్ చేసి మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
కేవలం లాంజ్ యాక్సెస్ మాత్రమే కాదు, రివార్డ్ పాయింట్ల లెక్క కూడా మారింది: అర్హత కలిగిన లావాదేవీలపై ప్రతి రూ. 150 ఖర్చుకు 4 పాయింట్లు, రూ. 200 ఖర్చుకు 5 పాయింట్ల చొప్పున రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఈ విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ఉండి, విదేశీ వ్యాపారులతో రూపాయల్లో జరిపే లావాదేవీలపై 1.75 శాతం డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ రుసుమును విధిస్తారు. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై లభించే ఉచిత ప్రయోజనాలను తగ్గిస్తూ వస్తున్నాయి. నిర్వహణ భారంతో పాటు, కార్డుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు బ్యాంకులు ఈ విధమైన ఖర్చు ఆధారిత బెనిఫిట్స్ విధానాన్ని అవలంబిస్తున్నాయి.




